Friday, April 17, 2026
E-PAPER
Homeజాతీయంనోయిడా కార్మికుల‌కు సీపీఐ(ఎం) పరామ‌ర్శ‌..అడ్డుకున్న పోలీసులు

నోయిడా కార్మికుల‌కు సీపీఐ(ఎం) పరామ‌ర్శ‌..అడ్డుకున్న పోలీసులు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: నోయిడాలో క‌నీస వేత‌నాలు పెంచాల‌ని కార్మికులు ఆందోళ‌న చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. నోయిడాలో కనీస వేతనాలు కోసం ఆందోళన చేసిన కార్మికుల మీద ప్రభుత్వం దమనకాండ సాగించింది. కార్మిక చట్టాల ఉల్లంఘన మీద పోరాడుతున్న వారిపై పోలీసులను ఉసిగొల్పింది. ఈ నేపథ్యంలో కార్మికుల పరామర్శ కోసం వెళ్తున్న సీపీఎం నేతలను బీజేపీ సర్కారు అడ్డుకుంది.

నోయిడాలో కార్మికుల సమ్మెలో అరెస్టయిన నాయకుల కుటుంబాలను కలవడానికి వెళ్తున్న సీపీఐ(ఎం) ప్రతినిధి బృందాన్ని మార్గమధ్యంలో అడ్డుకున్నారు. దాంతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేయాల్సి వచ్చింది. ఈ బృందంలో ప్రధాన కార్యదర్శి ఎం.ఎ. బేబీ, పొలిట్ బ్యూరో సభ్యులు అమ్రా రామ్, అరుణ్ కుమార్, ఎంపీలు వి. శివదాసన్, ఎ.ఎ. రహీం ఉన్నారు. వారు ధర్నా చేపట్టగా,చివరకు జిల్లా మేజిస్ట్రేట్ వారిని కలవడానికి అంగీకరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -