Saturday, April 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఖండెబల్లూరు పల్లె దవాఖానలో పాము సంచారం

ఖండెబల్లూరు పల్లె దవాఖానలో పాము సంచారం

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని ఖండెబల్లూరు గ్రామంలో పల్లె దవాఖాన (సబ్ సెంటర్) పరిసరాల్లో పాము సంచారం కనిపించడం వల్ల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ముఖ్యంగా రోగులు, గర్భిణీలు మరియు చిన్నపిల్లలకు ఇది ప్రమాదకరంగా మారిందని రోగులు అన్నారు. ఈ సందర్భంగా రోగులు మాట్లాడుతూ పల్లె దవాఖాన వద్ద శుభ్రత లేకపోవడం, పొదలు పెరగడం వలన ఈ సమస్య ఏర్పడిందని చెప్పారు. కాబట్టి సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పరిసరాలను శుభ్రం చేయించి, భద్రతా చర్యలు చేపట్టాలని మనవి చేస్తున్నామని తెలిపారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -