Saturday, April 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సన్‌షైన్ స్కూల్ లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే

సన్‌షైన్ స్కూల్ లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
జుక్కల్ మండలంలోని సన్‌షైన్ స్కూల్‌లో శనివారం గ్రాడ్యుయేషన్ డే ను ఘనంగా నిర్వహించారు. వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరికీ సర్టిఫికెట్లతో పాటు మెడల్స్‌ను సన్ షైన్ స్కూల్ ప్రిన్సిపాల్, కరస్పాండెట్ అందజేశారు. అనంతరం కరెస్పాండెంట్ శివకుమార్ మాట్లాడుతూ, విద్యార్థులు క్రమశిక్షణతో పాటు పట్టుదలతో చదివితే పోటీ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని, తద్వారా తల్లిదండ్రుల ఆశయాలు నెరవేరుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ శ్రీనివాస్, ప్రిన్సిపాల్ అశోక్, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -