Saturday, April 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్‘ఓ ప్రేమ’ త్వరలో మీ ముందుకు

‘ఓ ప్రేమ’ త్వరలో మీ ముందుకు

- Advertisement -

– దర్శకుడు ఆకారపు హరికృష్ణ
నవతెలంగాణ – ఉప్పునుంతల 

యువతకు స్వచ్ఛమైన సందేశం అందించే ఉద్దేశంతో రూపొందించిన లఘు చిత్రం “ఓ ప్రేమ” త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆధునిక భావజాలంతో కూడిన ప్రేమ కథను, అనుబంధాల విలువను తెలియజేస్తూ ఈ సినిమా రూపొందించబడింది. మార్చి 14 నుండి శరవేగంగా చిత్రీకరణ జరుపుకున్న ఈ లఘు చిత్రం సుమారు ఒక గంట నిడివితో ప్రేక్షకులను అలరించనుంది. ఈ చిత్రానికి ఆకారపు హరికృష్ణ దర్శకత్వం వహించడంతో పాటు కథ, కెమెరా, నిర్మాణ బాధ్యతలను కూడా స్వయంగా నిర్వహించడం విశేషం.

ఈ చిత్రంలో పులిజాల గ్రామానికి చెందిన అంజి, అనూష హీరో హీరోయిన్లుగా నటించగా.. పులిజాల శ్రీకాంత్, సింగర్ అలివేల, పోలిశెట్టి పల్లి గ్రామానికి చెందిన నారయ్య, పర్ష, కాసిం, హరి, అనిల్, నిరంజన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అచ్చంపేట పరిసర ప్రాంతాల్లోని పోలిశెట్టి పల్లి, పులిజాల, లింగాల ప్రాంతాల్లో సహజసిద్ధమైన లొకేషన్లలో చిత్రీకరణ పూర్తిచేయడం ద్వారా ఈ చిత్రానికి మరింత సహజత్వం తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా దర్శకుడు హరికృష్ణ మాట్లాడుతూ.. “ప్రేమ అంటే కేవలం ఆకర్షణ మాత్రమే కాదు, బాధ్యత కూడా అనే సందేశాన్ని యువతకు చేరవేయాలనే ఉద్దేశంతో ఈ కథను తెరకెక్కించాం. స్నేహితుల ప్రోత్సాహంతో తక్కువ బడ్జెట్‌లో (సుమారు మూడు లక్షలు) ఈ సినిమా పూర్తి చేశాం” అని తెలిపారు. ఎడిటింగ్ బాధ్యతలను పవన్ కళ్యాణ్ నిర్వహించారు.

ఈ లఘు చిత్రం మే 12న Viral Views Media యూట్యూబ్ ఛానల్‌లో విడుదల కానుంది. ఇప్పటికే చిత్రంపై మంచి స్పందన లభిస్తుందని చిత్రబృందం ఆశాభావం వ్యక్తం చేసింది. సంప్రదించడానికి: హరికృష్ణ – 7569787583 చిత్ర బృందం: దర్శకత్వం: ఆకారపు హరికృష్ణ కథ, కెమెరా, నిర్మాణం: ఆకారపు హరికృష్ణ. నటీనటులు: అంజి, అనూష, పులిజాల శ్రీకాంత్, అలివేల, నారయ్య, పర్ష, కాసిం, హరి, అనిల్, నిరంజన్ తదితరులు ఎవరి పాత్రల మేర వారు నటించారు.

ఎడిటింగ్: పవన్ కళ్యాణ్
“ఓ ప్రేమ” – ప్రేమకు కొత్త అర్థం చెప్పే నల్లమల్ల అడవుల నడుమ పుట్టిన హృద్యమైన కథ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -