రాష్ట్ర ఐటిశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
నవతెలంగాణ – మల్హర్ రావు
కాటారం మండలంలోని సోమవారం నస్తూర్ వెళ్లిలో సిఎం రేవంత్ రెడ్డిచే రైతు భరోసా విడుదల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు పిలుపునిచ్చారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు మంత్రివర్గ సహచరులు, రాష్ట్ర నాయకులు హాజరవుతారని తెలిపారు. రైతు భరోసా పథకం రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనమన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఈ సమావేశం నుంచి మంథని, రామగిరి, కమాన్పూర్, ముత్తారం, పాలకుర్తి మండలాల అధ్యక్షులు, ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలకు మంత్రి దిశానిర్దేశం చేశారు. కార్యక్రమం సజావుగా జరిగేలా బాధ్యతలు కేటాయించి, ప్రతి ఒక్కరు తమ తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని కోరారు.
రైతు భరోసా విడుదల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



