నవతెలంగాణ – సారంగాపూర్
మద్యం మత్తులో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని సాయినగర్ తండా లో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం మృతుడు రాథోడ్ లక్ష్మణ్(29) కొన్ని రోజులనుండి మద్యానికి బానిస అయ్యాడు. ఎలాంటి పనిచేయకుండా, ఆర్థిక పరిస్థితి బాగాలేక శుక్రవారం ఇంటిలో భార్య లేనిసమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇంటి ప్రక్కనే ఉన్న బంధువులు వెంటనే 108 వాహనాల్లో నిర్మల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం ఆదిలాబాద్ రిమ్ ఆసుపత్రికి తరంచగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి భార్య హీరబాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతునికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు.
పురుగుల మందు తాగి వ్యక్తి మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



