Saturday, April 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్టి-హబ్ లో నాణ్యమైన రక్త పరీక్షలతో ఖచ్చితమైన ఫలితాలు అందించాలి

టి-హబ్ లో నాణ్యమైన రక్త పరీక్షలతో ఖచ్చితమైన ఫలితాలు అందించాలి

- Advertisement -

జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్.. 
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్

టి – హబ్ సూర్యాపేట సేవల గురించి సమీక్ష సమావేశం కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మాట్లాడుతూ టి – హబ్ నందు మెరుగైన మరియు నాణ్యమైన రక్త పరీక్షల నిర్వహణ, ఖచ్చితమైన ఫలితాలు సమాయనుసారం రావటం, నివేదికలు అందజేయటం కోసం పర్యవేక్షించాలని సూచించారు. జి జి హెచ్ సూర్యాపేట, ఎ హెచ్ కోదాడ, పి‌హెచ్‌సి నేరేడుచెర్ల మరియు పి‌హెచ్‌సి గరిడేపల్లి ప్రాంతాల పరిధిలో సేకరించిన రక్త నమూనాలు ఎక్కువగా తిరస్కరణకు గురవుతున్నాయని, దీనికి గల కారణాల సమగ్ర నివేదిక సమర్పించాలని సూచించారు.

టి -హబ్ ప్రభావంతముగా నడిపించుటకు కావలసిన మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన ప్రతిపాదనలు సిద్దం చేసి అందజేయాలన్నారు. ప్రతి రోజు టి – హబ్ ద్వారా 1500 మంది లబ్దిదారులకు 5500 పైబడిన వివిధ రకాల రక్త పరీక్ష ఫలితాలు ఇవ్వటం జరుగుతుందని కలెక్టర్ అన్నారు.ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డా పెండెం వెంకట రమణ, డిసిహెచ్ఎస్ వెంకటేశ్వరరావు, ఇంచార్జ్ సూపరింటెండెంట్ డా శ్రీకాంత్ భట్, బయో కెమిస్ట్రీ, పెథోలోజీ, మైక్రో బయాలజీ విభాగాల అధిపతులు డా,, పావని కిరణ్మయి, పద్మావతి, తరుణ్, ప్రోగ్రాం అధికారి డా, జి ప్రసిద్ద్, ఆసుపత్రి నిర్వాహకులు డా,, మనీషా, డి.పి.ఓ. ఉమా మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -