Sunday, April 19, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమోడీ రెడీమేడ్‌ నాయకుడు

మోడీ రెడీమేడ్‌ నాయకుడు

- Advertisement -

ఫొటోలకు పోజులు తప్ప పని లేదు
టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌ గౌడ్‌
మోడీ తల వంచితే.. దేశం తల వంచదు
యూఎస్‌ ట్రేడ్‌ డీల్‌ చట్టాలను వెనక్కి తీసుకోవాలి
యువజన కాంగ్రెస్‌ ధర్నాలో మంత్రి సీతక్క
నవతెలంగాణ – ముషీరాబాద్‌

”నెహ్రూ, ఇందిరా గాంధీ నాయకత్వంలో దేశం అభివృద్ధి దిశగా ముందడుగు వేసింది.. నేడు దేశంలో రాకెట్లు తయారవుతున్నాయంటే ఆ గొప్పతనం వారిద్దరిదే.. ఇది మోడీ గొప్పతనం కాదు.. మోడీ కేవలం రెడీమేడ్‌ నాయకునిగా ఫొటోలకు పోజులు ఇస్తున్నారు” అని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు. హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌ ధర్నాచౌక్‌ వద్ద శనివారం యూత్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ‘దేశ ప్రజల ఆవేదన’ మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు జాతీయ యువజన కాంగ్రెస్‌ అధ్యక్షులు ఉదయభాను, టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌ గౌడ్‌, మంత్రి సీతక్క, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి, ఫిషరీ కార్పొరేషన్‌ చైర్మెన్‌ మెట్టు సాయికుమార్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు మాట్లాడుతూ.. దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ దూరదృష్టితో పాలన సాగించి పరిశ్రమలు, వ్యవసాయం అభివృద్ధికి పునాది వేశారని చెప్పారు. నెహ్రూ, ఇందిరా గాంధీ నాయకత్వంలో దేశం అభివృద్ధి దిశగా ముందడుగు వేసిందని, ప్రస్తుత ప్రభుత్వం ఆ దిశలో పనిచేయడం లేదని విమర్శించారు.

యూఎస్‌ ట్రేడ్‌ డీల్‌ చట్టాలను వెనక్కి తీసుకోవాలి : మంత్రి సీతక్క
యూఎస్‌ ట్రేడ్‌ డీల్‌ చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని మంత్రి సీతక్క కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుత ట్రేడ్‌ ఒప్పందాలు దేశ ఆర్థిక వ్యవస్థకు, స్థానిక వ్యాపారులకు నష్టాన్ని కలిగిస్తున్నాయని అన్నారు. ఈ విధమైన ఒప్పందాలు దేశ స్వాభిమానానికి విరుద్ధమని, వెంటనే రద్దు చేసి దేశ ప్రయోజనాలను కాపాడాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోడీ తల వంచితే దేశం తల వంచినట్టు కాదని తెలిపారు. మోడీ కో హటావో.. కిసాన్‌కు బచావో.. అని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ పార్టీపై తప్పుడు ప్రచారాలు, చేయడం సరికాదని, కేంద్ర ప్రభుత్వానికి మహిళల పట్ల చిత్తశుద్ధి ఉంటే మహిళా బిల్లును ప్రవేశపెట్టాలని కోరారు.

రైతుల పం టలకు నష్టం కలిగిలే విదేశీ ఒప్పందాలు
యూత్‌ కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షులు ఉదయభాను

రైతులు కష్టపడి పండించిన పంటలకు నష్టం కలిగించే విధంగా విదేశీ ఒప్పందాలు ఉన్నాయని, దేశ సంపదను కార్పొరేట్‌ సంస్థలకు మళ్లిస్తున్నారని యూత్‌ కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షులు ఉదయభాను ఆరోపించారు. కాంగ్రెస్‌ నాయకులు రాహుల్‌ గాంధీ, ఖర్గే ట్రేడ్‌ డీల్‌పై ప్రశ్నిస్తూనే ఉన్నారని, వెంటనే ఈ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఫిషరీస్‌ కార్పొరేషన్‌ చైర్మెన్‌ మెట్టు సాయికుమార్‌ మాట్లాడుతూ.. యువజన కాంగ్రెస్‌ కార్యకర్తలే పార్టీ భవిష్యత్‌ అని, వారికి నాయకత్వ అవకాశాలు ఉంటాయని తెలిపారు.

కాంగ్రెస్‌ పార్టీని కాపాడేది యువజన కాంగ్రెస్‌ అని తెలిపారు. పార్లమెంటులో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ, దక్షిణాది రాష్ట్రాలను కించపరిచేలా మాట్లాడటం సరికాదన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు చేస్తే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. యువతపై దేశ బాధ్యత ఉందని, దేశ ప్రయోజనాల కోసం యువజన కాంగ్రెస్‌ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని అన్నారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -