– మహిళలను దారుణంగా వంచించారు…
– డీలిమిటేషన్‌తో మహిళా బిల్లును ముడిపెట్టటం దారుణం
– వారిని ఆరెస్సెస్, బీజేపీ ఏనాడైనా గుర్తించాయా?
– మనువాదాన్ని రుద్దటమే వాటి లక్ష్యం : పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రధాని మోడీ పచ్చి మోసగాడని పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా బిల్లును డీలిమిటేషన్‌తో ముడి పెట్టటం ద్వారా ఆయన దేశంలోని మహిళం దర్నీ దారుణంగా వంచించారని దుయ్య బట్టారు. సిద్ధాంత రీత్యా ఆరెస్సెస్, బీజేపీ అనేవి మహిళా వ్యతిరేక సంస్థలని వ్యాఖ్యానించారు. మనువాదాన్ని దేశంపై బలంగా రుద్దటమే వాటి అసలు లక్ష్యమని అన్నారు. అందువల్లే మహిళా బిల్లును డీలిమిటే షన్తో ముడిపెట్టి నీరుగార్చారని విమర్శించారు. శనివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో నిర్వ హించిన విలేకర్ల సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, అధికార ప్రతినిధి లింగంయాదవ్. నాయకులు కల్పనారెడ్డి తదితరులతో కలిసి మహేశ్ కుమార్ మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చట్ట విరుద్ధంగా తీసుకొచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోవటాన్ని ప్రజాస్వామ్య విజయం గా ఆయన అభివర్ణించారు. దీంతో మోడీ సర్కార్ నియంతృత్వ పోకడలకు అడ్డుకట్ట పడిందని తెలిపారు. మహిళాబిల్లుతో ముడిపెట్టి అశాస్త్రీయంగా, అక్రమంగా డీలిమిటే షన్ బిల్లును తీసుకురావాలన్న బీజేపీ కుట్రను కాంగ్రెస్‌తో కలిసి ప్రతిపక్షాలు భగం చేశాయని తెలిపారు. ఆర్టికల్ 370 మీద ఉన్న శ్రద్ధ మహిళా బిల్లుపై ఎందుకు లేదని కేంద్రాన్ని ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పిస్తున్న బీజేపీ నేతలు.. ఆ పార్టీ ఏర్పడిన 46 ఏండ్లలో ఒక్క మహిళనైనా అధ్యక్షురాలిగా నియమించారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు అడ్డుకు న్నది మహిళా బిల్లును కాదని.. అక్రమంగా తీసుకొ చ్చిన డీలిమిటేషన్ బిల్లునే అని స్పష్టం చేశారు. 2024 ఎన్నికల్లోనే మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలంటూ తమ పార్టీ డిమాండ్ చేసిందని గుర్తు చేశారు. కానీ 2029, 2034 అంటూ బీజేపీ మహిళలను మోసం చేసిందని విమర్శించారు. 2023లో బిల్లు ఆమోదం పొందినా ఇప్పటి వరకు అమలు ఎందుకు కాలేదో బీజేపీ నేతలే చెప్పాలంటూ ఎద్దేవా చేశారు.
మహిళా రిజర్వేషన్లకు సంబంధించి కాంగ్రెస్ పైనా, ఇతర ప్రతిపక్షాలపైనా విమర్శలు గుప్పిస్తు న్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి… వచ్చేసారి ఎన్నికల్లో ‘జై శ్రీరామ్..’ అనకుండా ఓట్లను అడగాలంటూ మహేశ్ కుమార్ సవాల్ విసిరారు. ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఆయన సికింద్రాబాద్‌కు చేసింది ఏముందని నిలదీశారు. ఇన్నేండ్ల తన రాజకీయ జీవితంలో కిషన్‌రెడ్డి… ఒక్క ఓబీసీ నాయకుడినైనా తయారు చేశారా? అని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వ్యాఖ్యలపై ఆ పార్టీ రాష్ట్ర నేతలు, ఎంపీలు మౌనంగా ఉండటం శోచనీయమ న్నారు. మహిళా బిల్లుపై బీజేపీకి నిజంగా చిత్తశుద్ది ఉంటే సోమవారమే ఆ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. సోమవారం జగిత్యాల సభ కోసం టైగర్ (కేసీఆర్) బయటకొస్తు న్నారు కదా?అని అడగ్గా.. ‘రానీయ్యండి.. ఆ టైగర్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని మేకలు, గొర్రెలు, బర్రెలు, ఎన్ని కాళేశ్వరాలను తిన్నదో లెక్కలతో సహా బయటపెడతాం…’ అని ఎద్దేవా చేశారు.
ప్రధాని మోడీ పచ్చి మోసగాడు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



