- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
శ్రీ మహాత్మా బసవేశ్వర ఆశయాలను పాటిద్దాం ఆయన అడుగుజాడల్లో ముందుకెళ్దాం మనీ మద్నూర్ మండలంలోని గోజేగావ్ సర్పంచ్ భారత్ రాథోడ్, తడిఇప్పర్గ గ్రామ సర్పంచ్ అశ్విని సుదర్శన్ మున్న, అన్నారు. శ్రీ మహాత్మా బసవేశ్వర జయంతి సందర్భంగా ఆయా గ్రామాల్లోని గ్రామపంచాయతీ కార్యాలయాల్లో మహాత్మా బసవేశ్వర జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల సర్పంచులు మాట్లాడుతూ.. శ్రీ మహాత్మా బసవేశ్వర చూపించిన ఆశయాలను పాటిద్దాం ఆయన అడుగుజాడల్లో ముందుకెళ్దామన్నారు. ఈ వేడుకల్లో ఆయా గ్రామాల మాజీ సర్పంచులు గ్రామ పెద్దలు పంచాయతీ పాలకవర్గం సభ్యులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
- Advertisement -



