Thursday, September 10, 2026
E-PAPER
Homeఆటలుఅల్కరాస్‌‌కు షాక్‌

అల్కరాస్‌‌కు షాక్‌

- Advertisement -

క్వార్టర్స్‌‌లో ఓడిన డిఫెండింగ్‌ చాంప్‌
యుఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌‌స్లామ్‌

‌న్యూయార్క్‌ (‌యుఎస్‌ఏ) : యుఎస్‌ ఓపెన్‌‌లో మరో సంచలనం నమోదైంది. 24 గ్రాండ్‌‌స్లామ్స్‌ ‌విజేత నొవాక్‌ ‌జకోవిచ్‌ ‌తొలి రౌండ్లోనే నిష్ర్కమించగా.. తాజాగా డిఫెండింగ్‌ ‌చాంపియన్‌ కార్లోస్‌ అల్కరాస్‌ ‌క్వార్టర్‌‌ఫైనల్లో పరాజయం పాలయ్యాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ‌క్వార్టర్‌‌ఫైనల్లో అమెరికా ఆటగాడు, 8వ సీడ్‌ ‌బెన్‌ ‌షెల్టన్‌ ఐదు సెట్ల పోరాటంలో రెండో సీడ్‌‌కు షాక్‌ ఇచ్చాడు. 3 గంటల 33 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌‌లో 6-7(5-7), 6-1, 6-3, 1-6, 7-6(10-7)తో బెన్‌ ‌షెల్డన్‌ అద్భుతం చేశాడు. తొలి సెట్‌‌ను ట్రైబేకర్‌‌లో నెగ్గి అల్కరాస్‌ ‌ముందంజ వేయగా.. ఐదో సెట్‌‌ను టైబ్రేకర్‌‌లో సాధించి బెన్‌ ‌షెల్టన్‌ ‌న్యూయార్క్‌‌లో ప్రకంపనలు సృష్టించాడు. 8 ఏస్‌‌లు, ఐదు బ్రేక్‌ ‌పాయింట్లతో షెల్టన్‌ ‌రాణించాడు. పాయింట్ల పరంగా 169-163తో షెల్టన్‌ ‌పైచేయి నిలుపుకున్నాడు. మహిళల సింగిల్స్‌ ‌క్వార్టర్స్‌‌లో జెస్సికా పెగులా 3-6, 6-4, 6-3తో సహచర అమెరికా అమ్మాయి ఎమ్మా నవారోపై గెలుపొందింది. టాప్‌ ‌సీడ్‌ అరినా సబలెంక సైతం సెమీఫైనల్‌‌కు చేరుకున్న సంగతి తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -