ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కొలాబరేషన్లో ఓ సినిమా రూపొందనుంది. యంగ్‌స్టర్స్‌తో కలిసి ఓ సరికొత్త హర్రర్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. కీర్తన్ నాదగౌడ దర్శకత్వంలో నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ సమర్పిస్తున్నారు. సూర్య రాజ్ వీరబత్తిని, హను రెడ్డి, ప్రీతి పగడాల ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి టైటిల్ ‘418 ‘ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ అనౌన్స్ చేశారు మేకర్స్. టైటిల్ పోస్టర్ సినిమా కథపై క్యూరియాసిటీ పెంచింది. భయంతో కూడిన గ్రామంలోని మెడికల్ కాలేజ్ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోంది. సైన్స్, మిస్టరీ, మూఢనమ్మకానికీ అర్థం కాని ఒక సీక్రెట్‌తో, ఇప్పటివరకూ చూడని సరికొత్త కథతో ఈ చిత్రం ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వనుంది అని మేకర్స్ తెలిపారు. ‘ఓ పక్క భారీ చిత్రాలను నిర్మిస్తూనే, మరో పక్క క్రేజీ కాంబినేషన్లతో సరికొత్త చిత్రాల రూపకల్పనతో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ దేశవ్యాప్తంగా తనకంటూ ఓ ప్రత్యేకతను సొంతం చేసుకుంది. తాజాగా ప్రశాంత్ నీల్ సమర్పణలో ఓ భిన్న హర్రర్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రశాంత్ నీల్ సినిమాలు, అలాగే మైత్రి నిర్మాణ విలువలూ ఎలా ఉంటాయో వేరే చెప్పక్కర్లేదు. వీరి క్రేజీ కాంబోలో రాబోతున్న ఈసినిమా ప్రేక్షకులు పెట్టుకునే అంచనాలకు దీటుగా ఉంటుంది’ అని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ చిత్రంలో శ్రీ వైష్ణవ, శశాంక్ పాటిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: ప్రశాంత్ నీల్, నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్, దర్శకత్వం: కీర్తన్ నాదగౌడ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అనిల్ యెర్నేని, డీఓపీ : దినేష్ దివాకరన్, సంగీతం: వెంకీ జి.జి, డైలాగ్స్: మోహన్ బి.ఎస్, ప్రొడక్షన్ డిజైనర్: ఉల్లాస్ హైదూర్, కాస్ట్యూమ్ డిజైన్: సమద్ధి పటేల్, షర్నితా వల్లూరు.



