Friday, April 17, 2026
E-PAPER
Homeసినిమాప్రేక్షకుల కోరిక మేరకు రీ-రిలీజ్‌

ప్రేక్షకుల కోరిక మేరకు రీ-రిలీజ్‌

- Advertisement -

షెరాజ్‌ మెహదీ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘ఓ అందాల రాక్షసి’. గతంలో విడుదలైన ఈ సినిమా హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇప్పుడు ప్రేక్షకుల అభ్యర్థన మేరకు ఈ చిత్రాన్ని ఈనెల 24న రీ-రిలీజ్‌ చేయనున్నట్లు చిత్రయూనిట్‌ ప్రకటించింది.
ఈ సందర్భంగా ప్రసాద్‌ ల్యాబ్‌లో ప్రత్యేక ప్రదర్శన నిర్వహించి, మేకర్స్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు షెరాజ్‌ మెహదీ మాట్లాడుతూ, ‘అమ్మాయిలకు మోసాలు జరగకూడదనే ఉద్దేశంతో ఈ సబ్జెక్టు ఎంచు కున్నాను. ఈ సినిమా గ్లామర్‌పై ఆధారపడినది కాదు. మంచి కథా వస్తువుతో రూపొందిన ఉమెన్‌ ఓరియెంటెడ్‌ చిత్రం. సమాజంలో అమాయక మహిళలు ఎలా మోసపోతున్నారో చూపించడంతో పాటు, అలాంటి మోసాలకు పాల్పడేవారికి తగిన శిక్ష తప్పదనే సందేశాన్ని కూడా అందిస్తున్నాం. గతంలో ఈ సినిమాను మిస్‌ అయిన వారు, మళ్లీ చూడాలనుకునే వారు రీ-రిలీజ్‌ సందర్భంగా థియేటర్లకు వచ్చి చూడాలని కోరుతున్నాను’ అని తెలిపారు.
ఈ చిత్రం కన్నడలో ‘ఓ సుందర రాక్షసి’ పేరుతో విడుదలై, అక్కడ కూడా మంచి ఆదరణ పొందింది. ఈ చిత్రంలో విహాన్షి హెగాడే, కతి వర్మ, నేహా దేశపాండే, తమ్మారెడ్డి భరద్వాజ్‌, సుమన్‌ తల్వార్‌, షెరాజ్‌ మెహదీ, నేహా దేశ్‌పాండే, అనంత్‌ బాబు, ప్రియా తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ఈ చిత్రానికి షెరాజ్‌ మెహదీ సంగీతాన్ని కూడా అందించారు. అమ్మాయిలపై వేధింపులు, అత్యాచారాలకు పాల్పడేవారికి ఎలాంటి శిక్షలు ఉండాలి? మహిళల జోలికి వస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది? అనే సామాజిక అంశాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని షెరాజ్‌ మెహదీ ప్రభావవంతంగా తెరక్కించారని చిత్ర బృందం తెలిపింది.
స్కై ఈజ్‌ ది లిమిట్‌ స్టూడియోస్‌ పతాకంపై రూపొందిన ఈ చిత్రానికి సమర్పణ: షేర్‌, నిర్మాత: సురీందర్‌ కౌర్‌, సహ నిర్మాత: తేజిందర్‌ కౌర్‌, దర్శకత్వ, సంగీతం: షెరాజ్‌ మెహదీ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -