Friday, April 17, 2026
E-PAPER
Homeసినిమాసరికొత్త కాన్సెప్ట్‌..

సరికొత్త కాన్సెప్ట్‌..

- Advertisement -

వరుణ్‌ సందేశ్‌, గగన్‌, సత్యం రాజేష్‌, రవి ప్రధాన పాత్రల్లో ఎకె జంపన్న రచన, దర్శ కత్వంలో గోల్డెన్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై తోట లక్ష్మీ కోటేశ్వరరావు నిర్మిస్తున్న చిత్రం ‘క్యాస్ట్‌’. కశికా కపూర్‌, దివి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. తాజాగా మేకర్స్‌ గ్లింప్స్‌ లాంచ్‌ చేశారు. ఈ ఈవెంట్‌లో హీరో వరుణ్‌ సందేశ్‌ మాట్లా డుతూ,’ఈ కథ విన్నప్పుడు చాలా కొత్తగా, డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ అనిపించింది. ఇందులో చాలా బలమైన క్యారెక్టర్‌ చేశాను. అలాగే ప్రతి క్యారెక్టర్‌కు చాలా ప్రాధాన్యత ఉంటుంది. గగన్‌ చాలా డెడికేషన్‌తో చేశారు. యాంకర్‌ రవి నుంచి యాక్టర్‌ రవిగా తన చాప్టర్‌ ప్రారంభించబోతున్నారు. తను కూడా చాలా చక్కగా పెర్ఫార్మ్‌ చేశారు. సత్యం రాజేష్‌తో నా కాంబినేషన్‌ చాలా బాగుంటుంది. మీరు అందరూ చాలా ఎంజారు చేస్తారు. డైరెక్టర్‌ జంపన్న చాలా అద్భుతంగా ఈ సినిమా తీశారు. చాలా కొత్త ఆలోచనలతో వచ్చారు. ఆ ఆలోచనను ఎంకరేజ్‌ చేసిన మా నిర్మాత కోటేశ్వరరావుకి థ్యాంక్స్‌. ఒక పెద్ద ప్రొడక్షన్‌ హౌస్‌ ఏ విధంగా సినిమా తీస్తుందో అదే రేంజ్‌లో ఈ సినిమా తీశారు. ఈ సినిమాతో ఆయనకి పెద్ద సక్సెస్‌ రావాలని కోరుకుంటున్నాను. చాలా మంచి పాయింట్‌ తీసుకుని చాలా బ్యూటిఫుల్‌గా చూపించారు. అందరికీ కనెక్ట్‌ అవుతుంది’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -