Friday, April 17, 2026
E-PAPER
Homeసినిమా'ఐ యామ్‌ గేమ్‌' షూటింగ్‌ పూర్తి

‘ఐ యామ్‌ గేమ్‌’ షూటింగ్‌ పూర్తి

- Advertisement -

హీరో దుల్కర్‌ సల్మాన్‌ తాజాగా నటిస్తున్న ‘ఐయామ్‌ ఏ గేమ్‌’ సినిమా షూటింగ్‌ పూర్తయింది. ఈ సినిమా షూటింగ్‌ సుమారు 156 రోజుల పాటు సాగింది. దక్షిణ భారతదేశంలోని 100కి పైగా ప్రదేశాలలో చిత్రీకరించారు. నహాస్‌ హిదా యత్‌ దర్శకత్వం వహించిన ఈ భారీ బడ్జెట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ఆగస్టులో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.
ఈ చిత్రం దుల్కర్‌ సల్మాన్‌ కెరీర్‌లోనే అత్యంత భారీ చిత్రంగా రూపొందుతోంది. గత ఏడాది ‘లోకా’ సాధించిన భారీ విజయం తర్వాత, వే ఫారార్‌ ఫిల్మ్‌ సంస్థ నుండి వస్తున్న మరో ప్రతిష్టాత్మక చిత్రంగా ఇది నిలుస్తుంది. ఈ బ్యానర్‌పై దుల్కర్‌ సల్మాన్‌, జోమ్‌ వర్గీస్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్ర కథను షాబాస్‌ రషీద్‌, ఆదర్శ్‌ సుకుమారన్‌ సంయుక్తంగా రచించారు. దుల్కర్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ మూవీ కాకుండా మలయాళ చిత్రసీమలో అత్యంత భారీ నిర్మాణాలలో ఒకటిగా కూడా ఈ చిత్రాన్ని రూపొందించారు. బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘ఆర్‌డిఎక్స్‌’ తర్వాత నహాస్‌ హిదాయత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం దుల్కర్‌ సల్మాన్‌ కెరీర్‌లో 40వ చిత్రంగా నిలుస్తుంది.
ఈ చిత్రంలో ఆంటోనీ వర్గీస్‌, తమిళ నటుడు-దర్శకుడు మిష్కిన్‌, కాయదు లోహర్‌, కతిర్‌, పార్థ్‌ తివారీ, తమిళ నటి సంయుక్త విశ్వనాథన్‌ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంబంధించిన ‘ఫస్ట్‌ లుక్‌’, ‘సెకండ్‌ లుక్‌’ పోస్టర్లను గతంలోనే విడుదల చేశారు. వీటికి ప్రేక్షకుల నుండి భారీ స్పందన లభించింది. ఈ చిత్రం మలయాళం, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషలలో ‘పాన్‌-ఇండియా’ స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -