Sunday, April 19, 2026
E-PAPER
Homeసినిమామైథలాజికల్‌ యూనివర్స్‌ కాన్సెప్ట్‌..

మైథలాజికల్‌ యూనివర్స్‌ కాన్సెప్ట్‌..

- Advertisement -

భారతీయ సినిమాను గ్లోబల్‌ స్థాయికి తీసుకెళ్లేందుకు తనదైన ముందడుగు వేశారు హీరో విజరు దేవరకొండ. ‘హారు నాన్న’ డైరెక్టర్‌ శౌర్యువ్‌తో విజరు దేవరకొండ చేస్తున్న ఈ గ్లోబల్‌ ప్రాజెక్ట్‌ గురించి శనివారం మేకర్స్‌ అఫీషియల్‌గా అనౌన్స్‌ చేశారు.’ఇప్పుడు కనిపించే కోపమంతా ఒకప్పటి ప్రేమ’ అంటూ అనౌన్స్‌మెంట్‌ పోస్టర్‌ పై రాసిన క్యాప్షన్‌ క్యూరియాసిటీ క్రియేట్‌ చేస్తోంది. వైరా బ్యానర్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘హౌస్‌ ఆఫ్‌ ది డ్రాగన్‌, ఫాల్‌ ఔట్‌’ వంటి హాలీవుడ్‌ చిత్రాలకు పనిచేసిన అలెజాండ్రో మార్టినెజ్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ ఫొటోగ్రఫీగా బాధ్య తలు నిర్వహిస్తున్నారు. ‘గాడ్స్‌ ఆఫ్‌ ఈజిప్ట్‌, బ్యాట్‌ మ్యాన్‌ ఫరెవర్‌, స్నోపియర్సర్‌’ చిత్రాల వీఎఫ్‌ఎక్స్‌ సూపర్‌ వైజర్‌ ఎరిక్‌ డిస్ట్‌ దీనికి పని చేస్తున్నారు. ‘యానిమల్‌, ఓం శాంతి ఓం’ వంటి చిత్రాలకు పనిచేసిన సురేష్‌ సెల్వరాజన్‌ ప్రొడక్షన్‌ డిజైనర్‌గా వ్యవహరిస్తుండగా, పలు సూపర్‌ హిట్‌ చిత్రాల కంపోజర్‌ హేషమ్‌ అబ్దుల్‌ వాహాబ్‌ మ్యూజిక్‌ సమకూరుస్తున్నారు. మైథలాజికల్‌ యూనివర్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందనున్న ఈ సినిమా ఒక కొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు చూపించనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -