కల్వకుంట్ల కవిత ఆగ్రహం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాజీనామా చేసిన తర్వాత పార్లమెంటుకు వచ్చిన ధర్మేంద్ర ప్రధాన్ కు ఘన స్వాగతం పలుకుతూ జిందాబాద్ లు కొట్టటం పై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. దీని ద్వారా బీజేపీ సమాజానికి ఏం సందేశం ఇవ్వాలని భావిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ఎక్స్ లో ట్వీట్ చేశారు. ఇప్పటికే కేంద్రంపై తీవ్రమైన అసంతృప్తి, అపనమ్మకంతో ఉన్న యువతను ఈ సంఘటన మరింత రెచ్చగొట్టేలా ఉందని ఆక్షేపించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పశ్చాతాపం, జవాబుదా రీతనంతో కాదని తెలుస్తుందని తప్పుపట్టారు. కేవలం ప్రజల్లో ఉన్న ఆగ్రహాం నుంచి తప్పించుకోవటానికి రాజీనామా పేరుతో బీజేపీ నాటకం ఆడిందని దుయ్యబట్టారు. పార్టీ పట్ల విధేయంగా ఉంటే ప్రభుత్వంలో ఎన్ని తప్పులు చేసిన సరే పట్టించుకోరన్నది స్పష్టంగా తెలుస్తుందని విమర్శించారు. విద్యార్థుల జీవితాలను ఆగం చేసిన ధర్మేంద్ర ప్రధాన్, బీజేపీ లు తమ వైఫల్యాలను సైతం ఏదో ఘనకార్యం చేసినట్టు ఊరేగింపులు చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
తప్పు చేసిన వ్యక్తికి పార్లమెంటులో ఘన స్వాగతమా?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



