నవతెలంగాణ-ఆసిఫాబాద్
వేసవి సెలవులలో జనగణన విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు, అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు కొరకు పాఠశాలలలో విధులు నిర్వహించిన ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఆర్జిత సెలవులు మంజూరు చేయాలని పి ఆర్ టి యు టి ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ అన్నారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయ ఏవో కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేసవి సెలవులు ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు నిర్వహించిన విధులకు నేటికీ ఆర్జిత సెలవులు మంజూరు చేయకపోవడం బాధాకరమన్నారు. వెంటనే వాటిని మంజూరు చేయాలన్నారు. వేసవి సెలవుల్లో సమ్మర్ క్యాంపు నిర్వహించిన పిఎం శ్రీ స్కూల్ లకు సమ్మర్ క్యాంపు నిధులను మంజూరు చేయాలన్నారు. పాఠశాలలలో ఉపాధ్యాయుల కొరత నివారించడానికి పని సర్దుబాటు పూర్తి చేయాలన్నారు. డిఎస్సి 2008 కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను రెన్యువల్ చేస్తూ వేతనాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు రవి శంకర్, మహిళా ఉపాధ్యక్షురాలు గురువంత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయులకు ఈఎల్స్ మంజూరు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



