Thursday, September 10, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి

సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి

- Advertisement -

సీఐటీయూ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

యంగ్ వర్కర్లు ఎదుర్కుంటున్న సమస్యల మీద నేడు డిమాండ్స్ డే నిర్వహించాలని సీఐటీయూ యంగ్ వర్కర్స్ స్టీరింగ్ కమిటీ పిలుపునిచ్చింది.ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నేడు రాష్ట్ర కార్మిక శాఖ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యంగ్ పర్కర్స్ స్టీరింగ్ కమిటీ రాష్ట్ర కన్వీనర్, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్ మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ పరిశ్రమలు, కంపెనీలతో పాటు గిగ్ అండ్‌ ప్లాట్ఫామ్ వర్కర్స్, అసంఘటిత రంగం, స్కీం వర్కర్లలో లక్షలాది మంది యువ కార్మికులు కాంట్రాక్ట్, ఫి‌క్స్డ్‌, న్యాప్, న్యాట్స్, అప్రెంటీస్ తదితర నాన్-పర్మినెంట్ ఉద్యోగాల్లో పనిచేస్తున్నారని ‌తెలిపారు. అయితే వారికి ఉద్యోగ భద్రత, తగిన వేతనం, సామాజిక భద్రత కల్పించకుండా యాజమాన్యాలు శ్రమ దోపిడీకి పాల్పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పరిమినెంట్ కార్మికులతో సమానంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఫిక్స్డ్‌, న్యాప్, న్యాట్స్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం, సమాన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న జీవన వ్యయాలను దృష్టిలో ఉంచుకుని యువ కార్మికులకు కనీసం రూ.30 వేల వేతనం అమలు చేయాలని కోరారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్ మాట్లాడుతూ పని ప్రదేశాల్లో భద్రతా ప్రమాణాలు, తాగునీరు, మరుగుదొడ్లు, క్యాంటీన్, రవాణా వంటి ప్రాథమిక సౌకర్యాలను తప్పనిసరిగా కల్పించాలని డిమాండ్‌ ‌చేశారు. మహిళా కార్మికులకు సమాన వేతనం, ఉద్యోగ భద్రత, సురక్షితమైన పని వాతావరణం కల్పించాలని కోరారు. కార్మిక చట్టాలను ఉల్లంఘించే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యువ కార్మికుల శ్రమ దోపిడీని సీఐటీయూ సహించదని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శులు జె. వెంకటేష్, పి. సుధాకర్, హైదరాబాద్ సెంట్రల్ జిల్లా కార్యదర్శి జె. కుమారస్వామి, మేడ్చల్ జిల్లా స్టీరింగ్ కమిటీ కన్వీనర్ కె.ఎస్.ఎస్. మణికంఠ, పవన్, జి. రాంబాబు, జి.ఎస్. దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -