సర్పంచ్ ఈదారి చంద్రకళ కనకయ్య
నవతెలంగాణ – మిరుదొడ్డి
గ్రామ అభివృద్ధికి యువకులు ప్రతి ఒక్కరూ సహకరించాలని గ్రామ సర్పంచ్ ఇదారి చంద్రకళ కనకయ్య అన్నారు. ఆదివారం అక్బర్ పేట భూంపల్లి మండలం రుద్రారం గ్రామంలో 5 లక్షల రూపాయలతో సిసి రోడ్డు పనులను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాన్ని మరింత అభివృద్ధి చేయడానికి పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. గ్రామంలోని ప్రతి వాడవాడలో సిసిరో నిర్మాణ పనులు చేపడతామని వారు తెలిపారు. గ్రామ అభివృద్ధికి సహకరించిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకు గ్రామ సర్పంచ్ గారి చంద్రకళ కనకయ్య, ఉపసర్పంచ్ రమేష్ గౌడ్ వార్డు సభ్యుల లు ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ రమేష్ వార్డు సభ్యులు తోపాటు గ్రామ పెద్దలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



