నవతెలంగాణ-హైదరాబాద్ : ఈ వారం మీ సోషల్ మీడియా ఫీడ్‌లో నగరంలోని హుస్సేన్ సాగర్ సరస్సు వద్ద ప్రజలు దేనికోసమో వెదుకుతూ తీవ్రంగా తవ్వుతున్న దృశ్యాలు కనిపించి ఉంటే, మీరు ఒక్కరే కాదు. ఎందుకంటే, హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ సరస్సు వద్ద పారలతో కళ్యాణ్ జ్యువెలర్స్ బంగారు నాణేల కోసం వేటాడుతున్న జనసమూహాల వీడియోలు వైరల్ అయ్యి, ఇంటర్నెట్ లో విపరీతమైన చర్చకు దారితీసాయి.
క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ అయిన ఇన్‌స్టామార్ట్, మామ్స్ (MOMS) సహకారంతో నిర్వహించిన ఈ క్షేత్రస్థాయి కార్యక్రమం, నగరంలో అత్యధికంగా ఫోటోలు తీయబడిన సరస్సు తీరంలోని ఒక భాగాన్ని, చాలా మంది ఆన్‌లైన్ వినియోగదారులు “మినీ గోల్డ్ రష్” అని పిలిచే విధంగా మార్చేసింది. మట్టితో నింపిన గుంటలో దాచిన నాణేల కోసం నగరవాసులు తవ్వుతున్న క్లిప్‌లు వివిధ ప్లాట్‌ఫామ్‌లలో భారీ వీక్షణలను పొందాయి. ఈ చిత్రాలపై “ఇది హైదరాబాద్‌లో మాత్రమే సాధ్యం” నుండి “ఇది వింతగా వుంది ” వరకు వివిధ రకాల స్పందనలు వచ్చాయి.
ఈ కార్యక్రమం, ఇన్‌స్టామార్ట్‌లో ప్రారంభించబడిన ‘గోల్డ్ ప్రైస్ లాక్’ ఫీచర్‌తో పాటుగా జరిగింది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు ఏప్రిల్ 10 నుండి ఏప్రిల్ 16 మధ్య ఉన్న బంగారం ధరను ఖారారు చేసుకుని, ఆ తర్వాత బంగారం కొనడానికి పవిత్రమైన సందర్భంగా భావించే అక్షయ తృతీయ సమయంలో తమ కొనుగోలును పూర్తి చేసుకోవచ్చు.
ఈ క్యాంపెయిన్ లో భాగంగా, కార్యక్రమ ప్రదేశంలో దాచిన బంగారు నాణేలతో నిండిన ఒక పెద్ద గుంతను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్నవారిని ఆ గుంతను తవ్వి, తమ అదృష్టాన్ని పరీక్షించుకోమని ప్రోత్సహించారు. ఈ ఇంటరాక్టివ్ కార్యక్రమానికి ప్రజల నుంచి ఉత్సాహభరితమైన స్పందన లభించింది. రోజంతా జనం గుమిగూడగా, చాలామంది ఈ సందడిని తమ ఫోన్‌లలో బంధించారు. ‘గోల్డ్ డిగ్గర్స్’ అనే పేరుతో జరిగిన ఈ కార్యక్రమం సరదాగా సాగింది. బంగారు నాణేలు దొరకని వారికి, “ఈరోజు బంగారం ధరను లాక్ చేసుకోండి , అక్షయ తృతీయ నాడు ఇన్‌స్టామార్ట్‌తో కొనండి” అనే సందేశం కనిపించింది. ఒక వినియోగదారుడు సరదాగా, “పెద్దవాళ్ళు పిల్లల్లా ప్రవర్తించడం చూడటానికి చాలా నవ్వు వచ్చింది, అయితే ఒక విషయం మాత్రం బాగా ఆకట్టుకుంది…అది వారి నిబద్ధత… ” అని అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా బంగారం వినియోగించే అతిపెద్ద దేశాలలో భారతదేశం ఒకటి. సాధారణంగా అక్షయ తృతీయ సమయంలో దీనికి డిమాండ్ గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. ప్రపంచ స్వర్ణ మండలి (World Gold Council) లెక్కల ప్రకారం, ప్రతి ఏటా ఈ పండుగ వేళ, అధిక శాతం కొనుగోళ్లు జరుగుతుంటాయి ; కేవలం ఈ పండుగ సమయంలోనే దాదాపు 25 నుండి 30 టన్నుల బంగారం కొనుగోలు చేయబడుతుంది.
ఈ నెల చివర్లో రానున్న పండుగను పురస్కరించుకుని, ‘గోల్డ్ ప్రైస్ లాక్’ (బంగారం ధర స్థిరీకరణ) సదుపాయం ఇన్‌స్టామార్ట్ ప్లాట్‌ఫారమ్‌లో ఏప్రిల్ 16 వరకు అందుబాటులో ఉంటుంది.


