ఢిల్లీ భవనం కూలిన కేసులో
న్యూఢిల్లీ : ఢిల్లీలోని సత్యనికేతన్ భవనం కూలిన కేసు విచారణలో భాగంగా పిజి హాస్టల్ నిర్వాహకుల్లో ఒకరైన సుధా న్షును అరెస్ట్ చేసినట్లు బుధవారం పోలీసులు తెలిపారు. ఆది ారం మధ్యాహ్నం ఐదంతస్థుల భవనం కుప్పకూలిన ఘటనలో ఏడుగురు మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో భవనం లీజ్‌దారుల పాత్రను, భవనం బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్‌ల్లో జరిగిన మరమ్మత్తు, నిర్మాణ పనులను విచారిస్తున్నారని అన్నారు. ఈ భవనంలో ‘హాస్టల్ డేజ్’ పేరుతో పీజి హాస్టల్‌ను నిర్వహిస్తు న్నారని చెప్పారు. సుధాన్షు, మరో ఇద్దరు ఆ భవనాన్ని హాస్టల్ కోసం అద్దెకు తీసుకోవడానికి రెండేళ్ల ముందు వరకు భవనం ఖాళీగా ఉందని స్థానికులు తెలిపారు. మునిసిపల్ అధికారులు చేపట్టిన సీలింగ్ డ్రైవ్ అనంతరం, సమీపంలోని హాస్టళ్లు, పీజీలను ఖాళీ చేయిస్తున్నారని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. భద్రతా కారణాల దృష్ట్యా, కూలిపోయిన భవనానికి ఆనుకుని ఉన్న భవనాన్ని కూడా కూల్చివేస్తున్నారని చెప్పారు.
హాస్టల్ నిర్వాహకుని అరెస్ట్
- Advertisement -
- Advertisement -



