టీకాలంటే ఎందుకీ అపోహలు?ఎందుకీ దుష్ప్రచారం? టీకాలతోనే మరణాల శాతాన్ని అరికట్టగలమనే వాస్తవాన్ని ఎందుకు కనుమరు గుచేస్తున్నారు? మశూచి, కలరా, పోలియో, తట్టు, ఆటలమ్మ, వైరల్ డయేరియా వంటి అంటువ్యాధులు ప్రబలితే ప్రజల ఆరోగ్యం దెబ్బతినడమే కాక మరణాల సంఖ్య పెరిగేది కాదా? టీకాల వల్లనే ఈ సంఖ్యని తగ్గించగలి గామని, ఇంకా తగ్గించవలసి వుందనే శాస్త్రీయ అవగాహన నించి ఈనాటి ‘అభ్యుదయ కాముకులు’ ఎందుకు వెనుకంజ వేస్తున్నారు. కోవిడ్ వాక్సిన్ సందర్భంగా కూడా ఇలాంటి అనుమానాలే తలెత్తాయి. ప్రాణాంతకమైన వ్యాధుల నివారణకి ఉపాయాలు, టీకాలు ఉన్నప్పుడు వాటిని ఎందుకు అందిపుచ్చు కోకూడదు? నబఎaఅ ూaజూఱశ్రీశ్రీశీఎaఙఱతీబర Vaషషఱఅవ (హెచ్పివి) వాక్సిన్ విషయంలో కూడా సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం జరగడంవల్ల ప్రజల్లో ఎన్నో అపోహలు చోటు చేసుకుంటు న్నాయి. వ్యాధి నిరోధకతని పెంచే దిశగా ప్రజలను చైతన్య పరచవలసిన బాధ్యత డాక్టర్లదే కాదు, అభ్యుదయ కాముకులందరిదీ కూడా!
తొమ్మిది అపోహలను గుర్తించిన బి.యం.జె
బ్రిటిష్ మెడికల్ జర్నల్ (బి.యం.జె) 2022 జులైలోనే ఇలాంటి కొన్ని అపోహలకి సమాధానం చెప్పింది. 1.పాప్ స్మియర్ చాలు- టీకా అవసరం లేదు. 2.హెచ్.పి.వి. వాక్సిన్ కొత్తది – దాని సామర్ధ్యం ఇంకా నిరూపితం కాలేదు. 3.ఈ టీకా అండాశయాన్ని దెబ్బతీస్తుంది. 4.ఈ టీకా వల్ల ఆటో ఇమ్యూన్ జబ్బులు, నరాల వ్యాధులు, మరణం సంభవిస్తాయి. 5.పిల్లలు సెక్స్‌లో పాల్గొనే అవకాశం లేదు కాబట్టి, వారికి ఈ టీకా అనవసరం 6.పురుషులకి గర్భాశయం లేదు కాబట్టి, మగపిల్లలకి టీకా అవసరం లేదు. 7.మొదటి శారీరక సంపర్కం తర్వాత ఈ టీకా పనిచెయ్యదు. 8.సహజంగా వచ్చే హెచ్.పి.వి ఇన్ఫెక్షన్ వల్ల యాంటీబాడీలు తయారై వుంటాయి కాబట్టి టీకా అవసరంలేదు. 9.ఈ టీకా వేయించుకున్నామనే ధీమా వల్ల ప్రమాదకరమైన లైంగిక కార్యకలాపాలు, వివాహేతర సంబంధాలు పెరుగుతాయి.
ఇలాంటి అపోహలే మన దేశంలో కూడా చాలా కార్యక్రమాల్లో వ్యాప్తి చెందుతున్నాయి. తల్లులని తికమకపరు స్తున్నాయి. చాలామంది ఈ అపోహలకు ఆజ్యం పోస్తున్నారు. కారణాలు తెలిసిన ఎన్నో వ్యాధులని ఇంతవరకు నిరోధించలేక పోయిన మన దేశం ఈ టీకా ద్వారా ఏమి ప్రయోజనం సాధిస్తుందని, వ్యాధులకి మూలకారణమైన పోషకాహార లోపాన్ని సరిదిద్దకుండా టీకాలు తయారుచేసే వారి ప్రయోజనాలు నెరవేర్చడం కోసం ప్రజలని బలిపశువుల్ని చేస్తున్నారనీ వాపోతున్నారు. కాన్సర్ స్క్రీనింగ్ విరివిగా నిర్వహించి కాన్సర్‌ని అరికట్టాలి గానీ అతికొద్దిమందికి వచ్చే జబ్బు కోసం అందరికీ టీకా ఎందుకు వేయాలని వాదిస్తున్నారు.
పాప్ స్మియర్ స్క్రీనింగ్‌తో సర్వయికల్ కాన్సర్‌ని ముందుగానే గుర్తించడం వల్ల ఆ కాన్సర్‌ని త్వరగా నియంత్రించ గల్గడం వాస్తవమే అయినా, ఆ కాన్సర్‌ని అలా పూర్తిగా నిరోధిం చలేము. ఎందుకంటే, స్క్రీనింగులు మాత్రమే ఈ ఇన్ఫెక్షన్ని విరోధించలేవు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ స్క్రీనింగ్‌లు సమర్థవంతంగా జరగకపోవడం వల్ల ఎనభై ఐదు శాతం సర్వయికల్ కాన్సర్ మరణాలు అక్కడే సంభవిస్తున్నాయి. టీకాలు, స్క్రీనింగ్ – ఒకదానికొకటి తోడుగా వుంటేనే ఈ కాన్సర్ నివారణ తేలికవుతుంది – టీకా మాత్రమే ‘ఫ్రీ ఇన్వేసివ్ లీషన్స్’ అంటే (జూతీవ-ఱఅఙaరఱఙవ శ్రీవరఱశీఅర)ని, అంటే యోనిలో(వెజైనా), బాహ్య జననేంద్రియాలు (వల్వా), మలద్వారంలో(యానస్), పురుషాంగంలో, నోటిలో వచ్చే కాన్సర్లని నిరోధించగలదు. ఇవి స్క్రీనింగ్‌లో దొరకవు.
ఈ టీకా సురక్షితమే అని ఎన్నో క్లినికల్ ట్రయల్స్‌లో తేలింది. 1997 నించి అరంభమైన ట్రయల్స్ ఫలితాలు 2002 లో వెల్లడయ్యాయి. నాలుగు రకాల వైరస్ (6-11-16-18)ని నియంత్రించే టీకా 2006లో విడుదలయింది. ఇరవై ఐదేళ్ల పైగా అనుభవపూర్వకంగా ఈ టీకా సురక్షితం అని తేలింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ), సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ), ఈ వాస్తవాన్ని ధృవీకరించాయి. ఈ సంస్థలు ప్రజారోగ్య వ్యవస్థని బలపరుస్తూ, ఇన్ఫెక్షన్లని, జీవన శైలి వ్యాధులని నిరోధించి, గుర్తించి, అవి ప్రజారోగ్యానికి ప్రమాద కరంగా సంభవించినపుడు తగిన విధంగా స్పందిస్తాయి. సిడిసి మన ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో పొత్తు పెట్టుకుని, మన దేశంలో కూడా ప్రజారోగ్య పరిరక్షణకి దోహదపడుతుంది.
హెచ్.పి.వి. టీకా అండాశయాన్ని విఫలం చేస్తుందనే ఆపోహ 2018లో జరిగిన పరిశోధనలో తప్పని తేలిపోయింది. అప్పుడు దాదాపు ఇరవైవేల మందికి టీకా ఇచ్చి చేసిన పరిశోధనలో ఈ ఆపోహ తప్పని తేలింది. ఈ మధ్య జరిపిన డానిష్ పరిశోధన కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. లైంగిక సంపర్కానికి దూరంగా వుండే 9-14 ఏళ్ల పిల్లలకి ఈ వాక్సిన్ ఇవ్వడం ఎందుకనే వాదనకి సమాధానం – ఆ వయసులో టీకా ఇవ్వడం వల్ల యాంటీబాడీ టైటర్లు గణనీయంగా పెరిగి, వారిని సంరక్షిస్తాయి. ఆ వయసులో ఇచ్చే రెండు డోసులు ఆ టైటర్లని చాలా కాలం నిలిపి వుంచుతాయని తేలింది. ఒక్కడోసు ఇవ్వడం గురించి కూడా పరిశోధన సాగుతోంది.
మగపిల్లలకి ఈ టీకా ఎందుకివ్వాలనే వాదనకి సమాధానం – మగవారు ఈ వైరస్‌ని వ్యాపింపచేస్తారు. ఈ కారియర్లకి కూడా టీకా ఇవ్వడం వల్ల సామూహిక రోగ నిరోధక శక్తి (హెర్డ్ ఇమ్యునిటీ) పెరుగుతుంది. దానివల్ల ఈ కాన్సర్‌ని త్వరితగతిన అరికట్టవచ్చు. ప్రజల్లో ఎక్కువశాతానికి ఈ వ్యాధిని నిరోధించ గల శక్తి పెరిగితే, టీకా తీసుకోని వారికి కూడా రక్షణ పెరుగుతుంది. పురుషుల్లో రాగల నోరు, మల ద్వారం, పురుషాంగాలకాన్సర్ని కూడా నిరోధించవచ్చు. మొదటి శారీరక సంపర్కానికి ముందు ఇస్తే మాత్రమే ఈ కాన్సర్‌ని నిరోధించ వచ్చనేది కూడా వాస్తవం కాదు. ఆ తర్వాత దీని ప్రభావం గణనీయంగా వుంటుందని నిర్థారణ అయింది. పై ప్రీ కాన్సర్ లీషన్స్, అంటే భవిష్యత్తులో కాన్సర్గా మారే అవకాశం వున్న కేసుల్లో కూడా ఈ టీకా రక్షణ ఇస్తుందనే దిశగా పరిశోధన జరుగుతోంది.
సహజంగా వచ్చే హెచ్.పి.వి. ఇన్ఫెక్షన్ ఇచ్చే అంటీబాడీల కంటే టీకా ఏమి గొప్పదనే వాదనకి సమాధానం – 14 రకాల పరిశో ధనల్లో, 18 దేశాల్లో 24 వేల పైగా కేసుల్లో ఈ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన రోగనిరోధక శక్తి అతిస్వల్పమని తేలింది. అంటే, సహజంగా వచ్చే ఇమ్యూనిటీ అతి తక్కువ. మళ్లీ మళ్లీ ఇన్ఫెక్షన్ ప్రబలినా ఈ శక్తి పెరగడం లేదని స్పష్టమయింది. ముఖ్యంగా మగవారిలో సహజంగా వచ్చే రోగ నిరోధక శక్తి శూన్యం. కానీ టీకా తీసుకుంటే, యాంటీబాడీల తయారీ పుష్కలంగా వుండి, ఇన్ఫెక్షన్ని పారదోలే శక్తి గణనీయంగా పెరుగుతుందని తేలింది. కాబట్టి, ఒకసారి ఇన్ఫెక్షన్ ప్రబలినవారికి సైతం ఈ టీకావల్ల ప్రయోజనం మెండు. ఈ టీకా తీసు కుంటే, దీని రక్షణ వుందనే ధీమాతో యుక్తవయస్కులు విచ్చలవిడిగా వివాహేతర సంబంధాలు పెట్టుకుంటారనే వాదన కూడా వినిపిస్తోంది. ఈ టీకా తీసుకున్నా, తీసుకోకపోయినా, మీడియా వల్ల, సినిమాల వల్ల, మాదక ద్రవ్యాల వల్ల, చెదురుతున్న నైతిక విలువలవల్ల, విచ్చల విడితనం, అనేకులతో సంపర్కం అనేది పెరుగుతోంది. అలాంటి వారికి ఈ టీకా ఎంత తొందరగా ఇస్తే అంత మంచిదనేది శాస్త్రీయ అవగాహన.
అసలు టీకాలు ఏమిచేస్తాయి?
అవి అనేక తీవ్రమైన వ్యాధుల నించి మానవాళిని రక్షిస్తాయి. టీకాలు తీసుకున్న వారికే కాక, చుట్టుపక్కల వున్న కుటుంబ సభ్యు లకి, సమూహాలకి కూడా ఇవి మేలు చేస్తాయి. టీకాలు తీసుకోకూడని పరిస్థితులు వున్న వారికి సైతం ఇవి వ్యాధి నించి రక్షణ కల్పిస్తాయి – సామూహిక రోగ నిరోధక శక్తి ద్వారా అనేక పరిశోధనల తర్వాత, ట్రయల్స్ తర్వాత మాత్రమే వీటిని ప్రవేశపెడతారు కాబట్టి ఇది సురక్షితం. విస్తృతంగా ఇచ్చిన టీకాల వల్ల కొన్ని వ్యాధులు పూర్తిగా సమసిపోయే ఆకాశం వుంది. ఉదాహరణకి మశూచి (స్మాల్ పాక్స్‌ని) 1980 మే 8న పూర్తిగా నిర్మూలించగలిగాం. ప్రస్తుతం పోలియోని కూడా పూర్తిగా నిర్మూలించే దిశగా పయనిస్తున్నాం. టీకాలు మానేస్తే వ్యాధుల ఉధృతి పెరుగుతుంది. ఉదాహరణకి, కోవిడ్ కాలంలో చాలా మంది రెగ్యులర్ టీకాలు వేయించుకోక పోవడంవల్ల రెండు మూడు సంవత్సరాలుగా మీజిల్స్ (తట్టు), మమ్స్ (గవదబిళ్లలు) కేసులు పెరగడం చూస్తున్నాం. అందుకే ”వాక్సిన్ హెజిటెన్సీ (టీకాలు తీసుకోనితనం, సందేహించడం) అనేవి ప్రపంచ ఆరోగ్యానికి తీవ్రమైన అవరోధం” అని ప్రపంచ ఆరోగ్య సంస్థ నొక్కి చెప్పింది.
ప్రపంచవ్యాప్తంగా గర్భాశయ ముఖద్వార కాన్సర్ అతి విస్తృతమైన నాలుగు కాన్సర్లలో ఒకటి. మన దేశంలో స్త్రీలకి ప్రబలే రొమ్ము కాన్సర్ తర్వాత విరివిగా ప్రబలేది సర్వయికల్ కాన్సర్. 2022లో 662,000 కొత్త కేసులు బయటపడ్డాయి. అంటే, సంవత్సరానికి 127,000 కొత్త కేసులు వస్తున్నాయి. 2023లో 79,906 మహిళలు ఈ కాన్సర్‌తో చనిపోయారు. నలభై ఫైబడిన మహిళల్లో ఎనభై ఐదు శాతం కొత్త కేసులు, తొంభై శాతం మరణాలు కనిపిస్తాయి. విస్తృతంగా జరిపే స్క్రీనింగ్‌తో పాటు విరివిగా ఇచ్చే హెచ్పివి టీకాలవల్ల ఈ వ్యాధిని నిరోధిం చవచ్చు.
అందుకే, ఇంత విలువైన టీకాల మీద అనుమానాలు, ఆపోహాలు ప్రచారం చేయడం సబబు కాదు. హెచ్.పి.వి. టీకా లైవ్ టీకా కాదు. వైరస్ పైపొర నించి చాలా కొద్ది భాగాన్ని, నిద్రాణమైన భాగాన్ని మాత్రమే తీసి తయారుచేసిన టీకా. మనలో రోగనిరోధక ప్రతిస్పందన (ఇమ్యూన్ రెస్పాన్స్) కలిగిస్తుంది. ఇది సురక్షితమైనది. 12-13 ఏళ్ల వయసు పిల్లలకి వేసిన టీకా వల్ల 87-90 శాతం కాన్సర్ నిరో ధించబడుతుంది. 20 – 30 ఏళ్ల మధ్య వయస్కులకి ఇచ్చే టీకా వల్ల ఇది 63 శాతం మాత్రమే తగ్గుతుంది. అంతేకాక, మలద్వారం, నోరు, యోని, బాహ్య జననేంద్రియాలు, పురుషాంగం కాన్సర్ నిరోధా నికి, జననేంద్రియాల వార్డులు (మొటిమల వంటివి) నిరోధానికి కూడా ఇది పనికొస్తుంది. కాబట్టి, ఈ టీకా ప్రయోజనాల పట్ల, భద్రతపట్ల, సమర్థత పట్ల ఎలాంటి అనుమానాలు వుండనవ సరం లేదు. అన్ని టీకాల లాగానే ఇది కూడా మన ఆరోగ్య వ్యవస్థని బలోపేతం చేస్తుంది. కాన్సర్ నివారణలో గణనీ యంగా తోడ్పడుతుంది.
డాక్టర్ నళిని
9441426452
హెచ్పివి టీకాపై వదంతులు-వాస్తవాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



