Tuesday, September 22, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకృష్ణాజలాలను ఏపీకి వదిలేశారు

కృష్ణాజలాలను ఏపీకి వదిలేశారు

- Advertisement -

హరీశ్‌‌రావు విమర్శ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత, మాజీమంత్రి టి హరీశ్‌‌రావు తీవ్రంగా ఖండించారు. బీఆర్‌ఎస్‌ నాయకులను అక్రమంగా నిర్బం‌ధించడం దుర్మార్గమని విమర్శించారు. కృష్ణా జలాలను శ్రీశైలం నుంచి 738 కిలోమీటర్ల దూరంలో ఎక్కడో పెన్నా బేసిన్‌లో ఉన్న కుప్పం వరకు తరలిస్తుంటే పక్కనే ఉన్న పాలమూరుకు మాత్రం ఎందుకు తరలించడం లేదని సోమవారం ఎక్స్‌ ‌ద్వారా స్పందించారు. ఇది కాంగ్రెస్ పాలనా వైఫల్యం కాదా? పాలకుల చేతగానితనం కాదా?అని ప్రశ్నించారు.
రెండున్నరేండ్లపాటు కృష్ణానదిలో పుష్కలంగా నీళ్లు పారినా ఎందుకు మోటార్లను నడపలేదని అడిగారు. శ్రీశైలం నిండుకుండలా ఉన్నా రైతులకు నీళ్లు ఎత్తిపోసే ఆలోచన ఎందుకు చేయలేదని తెలిపారు. కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్‌కు వదిలిపెట్టి తెలంగాణ రైతుల ప్రయోజనాలను ఎందుకు గాలికొదిలేశారనీ, ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి, నీళ్ల మంత్రి ఉత్తమ్‌ దీనికి సమాధానం చె‌ప్పాలని డిమాండ్‌ ‌చేశారు. పాలమూరు ప్రాజెక్టును పడావు పెట్టి, రైతుల నోట్లో మట్టి కొట్టారని విమర్శించారు.
రైతులు నీళ్లు అడుగుతుంటే, వాళ్ల చేతికి సంకెళ్లు వేస్తారా?అని ప్రశ్నించారు. నీళ్లను ఒడిసి పట్టకుండా, విడిచిపెట్టి తెలంగాణకు జల ద్రోహం చేసింది ప్రభుత్వమనీ, శిక్ష రైతులు అనుభవించాలా?అని అడిగారు. జూరాల ఆయకట్టు రైతులకు వెంటనే సాగునీళ్లు విడుదల చేయాలనీ, అదుపులోకి తీసుకున్న తమ పార్టీ నాయకులను, రైతులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

పంటలకు నీళ్లివ్వమంటే అక్రమ అరెస్టులా?

​ఎండిపోతున్న పంటలకు నీళ్లివ్వమంటే అక్రమ అరెస్టులు చేయడం ఎంత వరకు సమంజసమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జూరాలలో తొమ్మిది టీఎంసీల నీరున్నా సాగునీరివ్వకపోవడం క్షమించరాని ద్రోహమని తెలిపారు. ​పంట పొలాలు కండ్లముందే ఎండిపోతుంటే కడుపు మండి నిరసనకు దిగిన అన్నదాతలపై, వారి తరఫున గళమెత్తిన బీఆర్ఎస్ నాయకులపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం అణచివేత చర్యలకు పాల్పడటం సరైంది కాదని తెలిపారు. కొప్పుల ఈశ్వర్‌

కుప్పంలో జలహారతి
కుప్పంలో జలహారతి తెలంగాణ రైతులకు కన్నీటి ఆరతి అని మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్‌‌రెడ్డి తెలిపారు. శ్రీశైలం నుంచి కృష్ణా జలాలు కుప్పం చేరుకున్నాయని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

శ్రీశైలం ప్రాజెక్టు నుంచి విడుదలైన నీటిని హంద్రీ–నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు ద్వారా, అందులో భాగమైన కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ ద్వారా తరలించి, కుప్పం నియోజకవర్గంలోని 110 చిన్నతరహా నీటిపారుదల చెరువుల ద్వారా 6,300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడంతోపాటు, 4.02 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టారని తెలిపారు. కృష్ణా నదికి పక్కనే ఉన్న పాలమూరు పల్లెలకు కృష్ణా జలాలు రావడం లేదని పేర్కొన్నారు. కరెంటు ఇవ్వకుండా, మోటార్లు నడవకుండా ఎత్తిపోతల మోటార్లను కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పొలాలు ఎండబెట్టిందని విమర్శించారు. జూరాల నుంచి నీళ్లు విడుదల చేయకుండా రైతులను ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందని తెలిపారు. ఎల్‌నినో పేరుతో తెలంగాణకు క్రాప్ హాలిడే ప్రకటించా‌రని పేర్కొన్నారు. తెలంగాణలో రైతులకు సాగునీళ్లు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్‌ఎస్‌ ‌నాయకులను వేధిస్తున్నదని తెలిపారు. ఏపీ ప్రభుత్వం నీటి తరలింపును అడ్డుకుని తెలంగాణ రైతులకు నీళ్లు ఇవ్వడంలో విఫలమైందని విమర్శించారు.
నిరంజన్‌‌రెడ్డి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -