Thursday, September 10, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమైనర్ల డ్రైవింగ్ సహించం: సజ్జనార్

మైనర్ల డ్రైవింగ్ సహించం: సజ్జనార్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థుల భద్రత, ట్రాఫిక్ క్రమశిక్షణ, డ్రగ్స్ నియంత్రణపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ విద్యాసంస్థల యాజమాన్యాలను అప్రమత్తం చేశారు. మైనర్లు వాహనాలు నడపడం చట్టవిరుద్ధమని, ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే విద్యార్థుల వివరాలను పాఠశాలలకు పంపిస్తామని శుక్రవారం ఆయన స్పష్టం చేశారు. పాఠశాల బస్సు డ్రైవర్లు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడుతుండటం ఆందోళనకరమని, చిన్నారుల ప్రాణాలకు ముప్పు కలిగించే నిర్లక్ష్యాన్ని ఉపేక్షించబోమని హెచ్చరించారు. పాఠశాలల వద్ద ట్రాఫిక్ సమస్యలు నివారణకు సీసీ కెమెరాలు, ట్రాఫిక్ మార్షల్స్ నియమించాలని సూచించారు. అసెంబ్లీల్లో ట్రాఫిక్ నియమాలు, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు సూచించారు. పాఠశాలల పరిసరాల్లో పొగాకు ఉత్పత్తుల విక్రయాలను అరికట్టేందుకు కోప్టా చట్టాన్ని కఠినంగా అమలు చేస్తున్నామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -