Magazines

ఒకే ప్రశ్న

1 గంట క్రితం

single question
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 29, 2026 | 1 నిమిషాల చదవడం

గొర్రెలు కసాయిని

ప్రశ్నిస్తున్నాయి.​

చెడువినకు చెడుకనకు

చెడు అనకు-తో పాటు

చెడుచేయకు నాలుగో కోతి

ధర్మస్థానం అధర్మంగా మారితే

వీధులు ఎరుపెక్కవా?

‘వలస పక్షుల వలనే

కూసాలు కదులుతున్నాయి’

అధినేతల అభిబాషణ

దోపిడీ లాభాల వేటకు

లేని హద్దులు

శ్రామికుల బతుకు తెరువుకేల?

పాలకుల పాపాలకు

వేలవేల దారులు

ఒకేమాట ఒకే బాణంలా

ఒకేప్రశ్న దేశమంతటా

ఓట్‌‌చోరీ ఎందుకు?


- కె.శాంతారావు, 9959745723

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్