Magazines

కమల ‘కళలు’!

26 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 07, 2026 | 1 నిమిషాల చదవడం

పైకి చూస్తేనేమో ‘‘దేశం, ధర్మం,హిందువులంతా బంధువులు’’ అంటూ గొంతు చించుకుని మరీ నీతులు చెబుతుంటారు. కానీ, ఆ ‘కమల దళం’ లోపలికి తొంగిచూస్తే అసలు కథ అర్థమవుతుంది. అక్కడ ప్రతి నాయకుడి ఇగో ‘హిమాలయ పర్వతం’కన్నా ఎత్తులో ఊరేగుతోంది! ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు పార్టీకోసం తను ఎంతగానో కష్టపడుతన్నానని చెబుతున్నాడు. కానీ, క్షేత్రస్థాయిలో ఆదరణ దక్కడం లేదు. కారణం, ఆయన ఒక బలమైన కోటరీ ఉచ్చులో ఇరుక్కోవడమే. పైగా ఆ పదవి కూడా ఆ కోటరీ రికమండేషన్ వల్లే వచ్చిందనే ప్రచారం జరగడం. దీంతో మిగతా గ్రూప్‌లు ఆయనకు సహకరించడం పూర్తిగా బంద్ పెట్టాయట! ఇక విలేకర్ల సమావేశాల్లో జరిగే తంతు మరీ విచిత్రం. రాంచందర్‌రావు పక్కన ఎంతమంది పెద్ద నాయకులు కూర్చున్నా, మరుసటి రోజు వచ్చే పేపర్ ప్రకటనలో మాత్రం కేవలం ఆయన పేరు ఒక్కటే వస్తుందట! ‘పేపర్లో పేరు రావడమే కదా ఎదుగుదలకు గీటురాయి’ అనుకునే మిగతా నాయకులు ఈ సెన్సార్‌షిప్‌కి గుర్రుగా ఉంటూ వారు కూడా అదే ‘సైలెంట్’బాట పడుతున్నారు. పెద్దల ఈ ఇగో చదరంగంలో నలిగిపోతూ ద్వితీయ శ్రేణి నాయకులే తీవ్రంగా కలత చెందుతున్నారు. ‘హిందువులంటే మాకు ఎంతో ప్రేమ, వారికోసం ఏమైనా చేస్తాం’ అంటూ మైకులు పగిలే మాట్లాడేవారు తోటి హిందువులను, అందులో సొంత నాయకులనే అణగదొక్కడంలో మాత్రం భలే ‘కమల కళలు’ ప్రదర్శిస్తున్నారని కార్యకర్తలు లోలోపల నవ్వుకుంటున్నారు.
- గుడిగ రఘు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్