Magazines

అక్క‌డ మూడింది.. ఇక్క‌డ కూడా...

32 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 07, 2026 | 1 నిమిషాల చదవడం

అమెరికా మ‌ధ్యంత‌ర ఎన్నిక‌ల్లో ఓట‌ర్లు ట్రంప్ మామ‌కు క‌ర్రుకాల్చి వాత‌పెట్టారు. డెమోక్రాట్ల విజృంభ‌ణ‌కు రిప‌బ్లిక‌న్లు కుదేల‌య్యారు. నియంతృత్వంతో విర్ర‌వీగి.. ఏక‌ప‌క్ష నిర్ణ‌యాల‌తో, యుద్ధోన్మాదంతో దుందుడుకు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతూ అమెరిక‌న్ల‌ను విసిగించి, వారి నిగ్ర‌హాన్ని ప‌రీక్షించి, ఆగ్ర‌హానికి గురైన ట్రంప్‌న‌కు స‌రైన గుణ‌పాఠ‌మే జ‌రిగింది. ఆ మామను గెలిపించాల‌ని కోరుతూ గ‌త ఎన్నిక‌లో ‘హౌడీ... మోడీ’ అంటూ అమెరికాలో ప్ర‌చారానికి వెళ్లొచ్చిన మ‌న ఢిల్లీ పెద్ద‌ల‌కు ఇప్పుడు ముచ్చెమ‌ట‌లు ప‌డుతున్నాయి. ఒక‌వైపు జ‌న్ జీ త‌రం పోరాటాలు, మ‌రోవైపు ప్ర‌పంచ‌వ్యాప్తంగా మారుతున్న ప‌రిణామాలు... వెర‌సి హ‌స్తిన‌లోని పాల‌కుల‌కు వెన్నులో వ‌ణుకు పుడుతోంది. పెద్దనోట్ల ర‌ద్దు, జీఎస్టీ, క‌రోనా క‌ష్టాలు, రైతు వ్య‌తిరేక న‌ల్ల‌చ‌ట్టాలు, ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు, ఓట్ చోరీ, ప్రాంతీయ పార్టీల‌ను చంపేయ‌టం, ప్ర‌జ‌ల ద్వారా ఎన్నుకున్న ప్ర‌భుత్వాల‌ను కూల్చేయ‌టం లాంటి ప్ర‌జా, రాజ్యాంగ వ్య‌తిరేక చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ్డ పాల‌కుల‌కు... మున్ముందు గ‌డ్డు ప‌రిస్థితులు ఎదురుకానున్నా యంటూ జోస్యం చెబుతున్నారు రాజ‌కీయ పండితులు. ఒక‌వేళ మ‌న ద‌గ్గ‌ర కూడా అమెరికాలో మాదిరిగా పార్ల‌మెంటుకు మ‌ధ్యంత‌ర ఎన్నిక‌లు ఉంటే ప‌రిస్థితి ఎలా ఉండేదో...

- బి.వి.య‌న్‌.ప‌ద్మ‌రాజు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్