ట్రంప్ ఆక్రోశం...
తన రచనలకు బహుమతి
ఇచ్చి ఉండాల్సిందని వ్యాఖ్య
వాషింగ్టన్ : ప్రపంచంలో అనేక యుద్ధాలను నివారించానని పదే పదే చెప్పుకున్నప్పటికీ తనకు నోబెల్ శాంతి బహుమతి రానందుకు తీవ్ర ఆశాభంగానికి, అసహనానికి గురైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు పులిట్జర్ బహుమతి విషయంలోనూ భంగపాటు తప్పలేదు. సౌత్ కరోలినాలో బుధవారం జరిగిన ఒక బహిరంగసభలో ట్రంప్ ప్రసంగిస్తూ తనకు ఈ రెండు పురస్కారాలు దక్కనందుకు ఆక్రోశం వెళ్లగక్కారు. తన రచనలకు గుర్తింపు ఇవ్వాల్సిందేనని పట్టుపట్టారు. రష్యాకు సంబంధించిన కథనాలు అందించిన పాత్రికేయులకు పులిట్జర్ బహుమతులు రావడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారి కథనాలుఅవాస్తవమైనవని ఆరోపించారు. ‘నాకు నోబెల్ పురస్కారం రాలేదు. పులిట్జర్ కూడా దక్కలేదు. నిజానికి నా రచనలకు పులిట్జర్ ఇవ్వాల్సింది’ అని అన్నారు.
పిల్లల పుస్తకం రాయలేని వాడికి బహుమతా ?
‘పులిట్జర్ బహుమతి పొందిన వారికి అది దక్కకూడదు. రష్యాకు సంబంధించి అద్భుతంగా రాశారని వారికి ఆ బహుమతి ఇచ్చారు. కానీ వారు రాసిందంతా తప్పే’ అని ట్రంప్ చెప్పారు. పులిట్జర్ అనేది జర్నలిజంలో అత్యంత ప్రతిష్టాత్మక బహుమతి. నోబెల్ పురస్కారం దక్కకపోవడాన్ని ట్రంప్ మరోసారి ప్రస్తావిస్తూ అనేక యుద్ధాలను ఆపినందుకు తనకు ఆ గౌరవం లభించి ఉండాల్సిందని అన్నారు. కాగా తనకు పులిట్జర్ బహుమతి రావాలంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాలలో నెటిజన్లు వ్యంగ్యోక్తులు విసురుతున్నారు. ‘పిల్లల కోసం కనీసం ఓ పుస్తకమైనా రాయలేని వ్యక్తికి పులిట్జర్ కావాలా’ అని ఓ నెటిజన్ ఎద్దేవా చేశారు. ట్రంప్ ఆంగ్ల భాషను బందీగా చూస్తారని, ఆయన రాసిన వాక్యాలను పరిశీలించడానికి ఓ బృందాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుందని మరో నెటిజన్ రాశారు.
ఇరాన్‌తో ఎలాంటి చర్చలు జరపడం లేదు : డోనాల్డ్ ట్రంప్
ఇరాన్‌తో యుద్ధం గురించి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా ప్రస్తుతం ఇరాన్‌తో ఎటువంటి చర్చలు జరపడం లేదన్నారు. అయితే త్వరలోనే ఏదో ఒకటి జరగబోతోందని తెలిపారు. ఇరాన్ అణు ఆయుధాలను అభివృద్ధి చేయకుండా అడ్డుకోవడం తన పరిపాలనా కాలంలో సాధించిన అత్యంత ముఖ్యమైన విజయాలలో ఒకటని పేర్కొన్నారు. ఒకవేళ అమెరికా జోక్యం చేసుకోకపోతే, ఇరాన్ ఇప్పటికే అణు ఆయుధాలను ఉపయోగించి ఉండేదని పేర్కొన్నారు."ఇరాన్‌తో చర్చలు జరపడం లేదు. రానున్న రోజుల్లో ఏదో ఒకటి జరుగుతుంది. చాలా మంది అమెరికా మధ్యంతర ఎన్నికల తర్వాత ఇరాన్ విషయంలో ఏదో ఒకటి జరుగుతుందని భావిస్తున్నారు.





కామెంట్లు (0)