Magazines

చైనా నిధులతో కాంబోడియాలో రహదారి నిర్మాణం

50 నిమిషాల క్రితం

Road construction in Cambodia with Chinese funding
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 05, 2026 | 1 నిమిషాల చదవడం

ప్రాంతీయ వాణిజ్యం, పర్యాటకాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రాజెక్టు

నమ్‌ పెన్‌ (కాంబోడియా) : చైనా నిధులతో నిర్మించిన ఓ జాతీయ రహదారిని కాంబోడియా అధికారికంగా ప్రారంభించింది. ఈ ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్‌ నిర్మాణానికి ఐదేండ్ల కాలం పట్టింది. ప్రాంతీయ వాణిజ్యం, పర్యాటకాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. 198.5 కిలోమీటర్ల పొడవైన రహదారిని వ్యూహాత్మక మార్గంగా, దేశానికి కొత్త ఆర్థిక జీవనాడిగా ప్రధాని హున్‌ మానెట్‌ అభివర్ణించారు. ఈ రహదారి పుర్సట్‌ రాష్ట్రంలోని వీల్‌వెంగ్‌ జిల్లా మీదుగా బట్టంబంగ్‌ రాష్ట్రంలోని సమ్లత్‌ జిల్లాను, కోహ్‌కాంగ్‌ రాష్ట్రంలోని ఖెమరక్‌ ఫౌమిన్‌ను కలుపుతోంది. దేశంలోనే అత్యంత పొడవైన వంతెనను కలిగిన ఈ రహదారి ఒకప్పుడు అంతర్యుద్ధాలకు నిలయమైన పర్వతాలు, లోయలు, పల్లపు ప్రాంతాలతో కూడిన భూభాగాన్ని సామాజిక, ఆర్థిక కార్యకలాపాలకు చైతన్యవంతమైన ప్రాంతంగా మా ర్చిందని ప్రధాని చెప్పారు. ఇది ప్రయాణ ఖర్చులను, సమయాన్ని, దూరాన్ని గణ నీయంగా తగ్గిస్తుందని తెలిపారు. రెండు లేన్ల ఈ రహదారిని చైనా రోడ్డు-బ్రిడ్జి కార్పొరేషన్‌ నిర్మించింది. ఈ సంస్థకు చైనా ప్రభుత్వం అందించిన రాయితీ రుణంతో నిధులు సమకూరాయి. 2020 మార్చి నుంచి గతేడాది మే వరకూ నిర్మాణం సాగింది.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్