Magazines

రష్యాపైకి డ్రోన్ల దాడి

51 నిమిషాల క్రితం

Drone attack
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 19, 2026 | 1 నిమిషాల చదవడం

మంటల్లో ఇంధన టెర్మినల్‌

కీవ్ : రష్యాపై ఉక్రెయిన్‌ భారీస్థాయిలో విరుచుకుపడింది. ఏకకాలంలో వెయ్యికిపైగా డ్రోన్లను ప్రయోగించింది. ఉక్రెయిన్‌ జరిపిన అతిపెద్ద వైమానిక దాడుల్లో ఇది ఒకటి. ఈ డ్రోన్ల దాడిలో సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లోని ఓ ఇంధన టెర్మినల్‌ మంటల్లో చిక్కుకుపోయింది. రష్యా చమురు మౌలిక సదుపాయాలను కీవ్ లక్ష్యంగా చేసుకోవడాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విమర్శిస్తున్న తరుణంలోనే తాజా దాడులు జరగడం గమనార్హం. ఉక్రెయిన్‌ దాడుల్లో ఒకరు మృతి చెందగా.. మరో ఐదుగురు గాయపడినట్టు స్థానిక అధికారులు తెలిపారు. పీటర్స్‌బర్గ్ ఆయిల్‌ టెర్మినల్‌తోపాటు రూచి ఆయిల్ డిపోలో మంటలు చెలరేగాయని చెప్పారు. ఓజోన్‌ లాజిస్టిక్స్ కేంద్రం, వీకే డేటా సెంటర్‌పైనా దాడులు జరిగాయన్నారు. మొత్తం 1,015 ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చేసినట్టు రష్యా రక్షణ శాఖ తెలిపింది. మరోవైపు.. ఉక్రెయిన్‌లోని జపోరిజియాపై రష్యా జరిపిన దాడుల్లో ఒక మహిళ ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్