Magazines

ట్రంప్‌ను బోనులో బంధించిన ఇరాన్‌

51 నిమిషాల క్రితం

Trump
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 25, 2026 | 1 నిమిషాల చదవడం

జైలు గదిలో నిద్రపోతున్నట్టు అమెరికా అధ్యక్షుడి వేషధారణ

ఇరాన్‌లో పెండ్లిపై యూఎస్‌ దాడికి నిరసనగా వ్యంగ్య ప్రదర్శన

టెహ్రాన్‌లో సందర్శకులను ఆకర్షిస్తున్న భారీ బిల్‌బోర్డు


టెహ్రాన్‌ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌పై ఇరాన్‌ వినూత్న రీతిలో వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ట్రంప్‌ జైలులో బందీగా ఉన్నట్టు, ఊచలు పట్టుకుని కదిలిస్తున్నట్టు, చివరకు మంచంపై నిద్రపోతున్నట్టు చూపించే భారీ ప్రదర్శనను టెహ్రాన్‌లో ఏర్పాటు చేసింది. గత నెలలో దక్షిణ ఇరాన్‌లోని కుహెస్తక్‌ పట్టణంలో ఓ వివాహ వేడుకపై జరిగిన అమెరికా దాడిని నిరసిస్తూ ఈ ప్రదర్శన చేపట్టింది. టెహ్రాన్‌లో అత్యంత రద్దీగా ఉండే తాజ్రిష్‌ కూడలిలో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో ట్రంప్‌ ముసుగు, విగ్గు ధరించిన ఓ వ్యక్తిని జైలు గదిని పోలిన బోనులో ఉంచారు. అందులో మంచం, మరుగుదొడ్డి, సింక్‌ కూడా ఏర్పాటు చేశారు. ఈ దృశ్యాలను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివస్తుండగా, పలువురు తమ ఫోన్లలో వీడియోలు తీసుకుంటున్నారు. బోను వెనుక ఉన్న ఎలక్ట్రానిక్‌ తెరపై వివాహ వేడుకపై దాడికి సంబంధించిన దృశ్యాలు, నేర స్థలాన్ని తలపించే చిత్రాలను ప్రదర్శిస్తున్నారు. టెహ్రాన్‌ మున్సిపాలిటీకి అనుబంధంగా పనిచేసే నగర సుందరీకరణ సంస్థ మంగళవారం ఈ ఏర్పాటును ప్రారంభించినట్టు ఇరాన్‌ ప్రభుత్వ మీడియా తెలిపింది. 15 రోజుల పాటు ఈ ప్రచారం కొనసాగనుంది. ఫిబ్రవరిలో ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్‌ దాడులు చేసినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. అమెరికాను లక్ష్యంగా చేసుకుని బహిరంగ ప్రదేశాల్లో రాజకీయ సందేశాలతో కూడిన బిల్‌బోర్డులను ఇరాన్‌ ఏర్పాటు చేస్తోంది. గతంలో ట్రంప్‌ శవపేటికలో ఉన్నట్టు చూపించే ప్రదర్శననూ నిర్వహించింది.




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్