సుదీర్ఘ అనుభవంతో పాటు సాంకేతిక నిపుణుడు : ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి అభివృద్ధిలోనూ కీలకపాత్ర
టెహ్రాన్ : ఇరాన్ రక్షణ మంత్రిగా మెహర్దాబ్ అఖ్లాకీ కెతాబ్చీ నియమితులయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇరాన్ పార్లమెంట్ ఆదివారం సమావేశమై ఆయనను రక్షణ మంత్రిగా ఎన్నుకుంది. కెతాబ్చీకి 237 మంది సభ్యులు మద్దతు తెలిపి రక్షణ, సాయుధ దళాల లాజిస్టిక్ మంత్రిగా ఆయన నియామకాన్ని ఆమోదించారు. కేవలం పదిహేను మంది మాత్రమే ఆయన నియామకాన్ని వ్యతిరేకిం చారు. కెతాబ్చీ పేరును ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రతిపాదించారు. రక్షణ రంగ పరి శ్రమలో సుమారు 42 సంవత్సరాలకు పైగా సుదీర్ఘ అనుభవం ఉన్న కెతాబ్చీ క్షిపణి సాంకేతిక నిపుణుడు. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి అభివృద్ధి కార్యక్రమాలతో సంబంధం ఉన్నదన్న ఆరోపణలపై ఐరాస, అమెరికా, యూరోపియన్ యూనియన్ గతంలో ఆయనపై ఆంక్షలు విధించాయి.






కామెంట్లు (0)