నవతెలంగాణ - హైదరాబాద్ : విద్యారంగ సంస్కరణలు కోరుతూ ఫ్రాన్స్లో కొనసాగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. పారిస్లో ఆందోళనకారులు ఓ కారుతోపాటు దుకాణానికి నిప్పుపెట్టారు. లియోన్లో పర్యాటక కార్యాలయానికి, మార్సెయిల్లో పోలీస్ స్టేషన్తోపాటు పలు దుకాణాలకు నష్టం కలిగించారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు బాష్పవాయు గోళాలు, జలఫిరంగులు ప్రయోగించారు. హింసాత్మక ఘటనలకు సంబంధించి దేశవ్యాప్తంగా 166 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పాఠశాలల్లో వసతుల కొరత, ఉపాధ్యాయుల ఖాళీలు, విద్యారంగానికి నిధుల లేమి, శిథిలావస్థలో ఉన్న భవనాల సమస్యలపై విద్యార్థులు, కార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి. విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల ప్రక్రియ సంక్లిష్టంగా ఉండటంపైనా విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.





కామెంట్లు (0)