రాణించిన
రోహిత్ శర్మ, రుతురాజ్
మూడో వన్డేలో
భారత్ 351/7
నవతెలంగాణ-న్యూ చంఢీగడ్ : తొలి రెండు వన్డేల్లో టాప్ ఆర్డర్ పరుగుల వరద పారించగా.. మూడో వన్డేలో మిడిల్ ఆర్డర్ దంచికొట్టింది. సిరీస్‌లో తొలిసారి బ్యాటింగ్‌కు వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ కెఎల్ రాహుల్ (129 నాటౌట్, 87 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్‌లు) అజేయ సెంచరీతో చెలరేగాడు. రుతురాజ్ గైక్వాడ్ (57, 69 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్‌లు), ఓపెనర్ రోహిత్ శర్మ (92, 85 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో రాణించారు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియాకు ఆరంభం కలిసి రాలేదు. భీకర ఫామ్‌లో ఉన్న కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (1), విరాట్ కోహ్లి (0) మూడు ఓవర్లలోపే పెవిలియన్‌కు చేరారు. 4 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన భారత్ పవర్‌ప్లేలో 28 పరుగులే చేసింది. ఈ దశలో ఓపెనర్ రోహిత్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్‌లు మూడో వికెట్‌కు కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. 137 పరుగులు జోడించిన రోహిత్, రుతురాజ్‌లు భారత్‌ను మంచి స్కోరు దిశగా నడిపించారు. సెంచరీ ముగింట రోహిత్ శర్మ అవుట్ కాగా, రుతురాజ్ సైతం అర్థ సెంచరీ తర్వాత వికెట్ కోల్పోయాడు. కెఎల్ రాహుల్, నమన్ ధిర్ (30) ఇన్నింగ్స్‌ను ధాటిగా నడిపించారు. ఐదు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 41 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన రాహుల్.. సెంచరీని మరో 39 బంతుల్లోనే బాదేశాడు. ఆఖర్లో అన్షుల్ కాంబోజ్ (17) రెండు సిక్సర్లతో ఇన్నింగ్స్‌కు ఊపు తీసుకొచ్చాడు. 50 ఓవర్లలో 7 వికెట్లకు భారత్ 351 పరుగులు చేసింది.
రాహుల్ అజేయ సెంచరీ
42 నిమిషాల క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది అక్టో 04, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)