Magazines

ఆసియా విజేత భారత్‌

22 గంటల క్రితం

Asian champion
avatar
balaji

ప్రచురించబడింది నవం 05, 2026 | 1 నిమిషాల చదవడం

‌ఫైనల్లో జపాన్‌‌పై 4-1తో గెలుపు

మొహాలి : ఆసియా హాకీ చాంపియన్స్‌ ‌ట్రోఫీని టీమ్‌ ఇండియా నిలబెట్టుకుంది. డిఫెండింగ్‌ ‌చాంపియన్‌ ‌భారత్‌ గురువారం జరిగిన ఫైనల్లో జపాన్‌‌పై 4-1తో ఘన విజయం సాధించింది. 2011, 2016, 2018, 2023, 2024లో చాంపియన్‌‌గా నిలిచిన టీమ్‌ ఇండియా.. హ్యాట్రిక్‌ ‌టైటిల్‌‌తో పాటు ఆసియా చాంపియన్స్‌ ‌ట్రోఫీలో సిక్సర్‌ ‌కొట్టింది. గురువారం మొహాలోని ఒలింపియన్‌ ‌సీనియర్‌ ‌బల్బీర్‌ ‌సింగ్‌ ‌స్టేడియంలో జరిగిన టైటిల్‌ ‌పోరులో జపాన్‌ ‌తొలి గోల్‌ ‌చేసింది. ఆట మొదలైన మూడో నిమిషంలోనే మట్సుమోటో జపాన్‌‌ను 1-0తో ముందంజలో నిలిపాడు. 42వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌‌ను లక్రా గోల్‌‌గా మలిచాడు. దీంతో భారత్‌ 1-1తో స్కోరు చేసింది. ఇక ఆఖరు క్వార్టర్‌‌లో భారత్‌ ‌మరో మూడు గోల్స్‌‌తో రెచ్చిపోయింది. 48వ నిమిషంలో దిల్‌‌ప్రీత్‌ , 54వ నిమిషంలో సుఖ్‌‌జీత్‌‌లు ఫీల్డ్‌ ‌గోల్స్‌ ‌నమోదు చేయగా.. 53వ నిమిషంలో జగ్‌‌రాజ్‌ ‌పెనాల్టీ కార్నర్‌‌ను గోల్‌ ‌కొట్టాడు. ఫైనల్లో అత్యధిక భాగం వెనుకంజలో నిలిచిన భారత్‌ ఆఖరు 15 నిమిషాల్లో అద్భుతం చేసింది. తొలిసారి ఆసియా చాంపియన్స్‌ ‌ట్రోఫీ అందుకోవాలని ఆశించిన జపాన్‌‌పై గోల్స్‌ ‌వర్షం విరుచుకుపడిన భారత్‌.. మెరుపు విజయంతో రికార్డు ఆరోటైటిల్‌‌ను ఖాతాలో వేసుకుంది. ​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్