Magazines

రెండున్నరేళ్లుగా గుడిసెల్లోనే పేదల నిరీక్షణ!

22 నిమిషాల క్రితం

CPI
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 06, 2026 | 1 నిమిషాల చదవడం

ఇంటి స్థలాలేవి..? ఇందిరమ్మ ఇళ్లేవి..?

సర్వే నంబర్‌ 8లోని ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకున్న పేదలకు న్యాయం చేయాలి

ఇంటి స్థలాలు కేటాయించకుంటే భూపోరాటం ఉధృతం చేస్తాం: సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు చెక్క వెంకటేష్

 నవతెలంగాణ - ఆలేరు రూరల్‌

సొంతింటి కల పేదలకు కలగానే మిగులుతోంది. గూడు కోసం ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకొని రెండున్నరేళ్లుగా ఎదురుచూస్తున్నా పాలకుల నుంచి స్పందన కరువైంది. ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలోని సర్వే నంబర్‌ 8లో ఉన్న మూడు ఎకరాల ప్రభుత్వ భూమిలో అర్హులైన పేదలు గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారు. అయినప్పటికీ వారికి ఇంటి స్థలాలు కేటాయించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా పేదల ఇళ్ల సమస్యను పరిష్కరించకపోవడం విచారకరమని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు చెక్క వెంకటేష్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం,స్థానిక ఆలేరు ఎమ్మెల్యే, సంబంధిత అధికారులు స్పందించి సర్వే నంబర్‌ 8లోని ప్రభుత్వ భూమిలో అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు కేటాయించడంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు.


పేదలకు న్యాయం జరిగే వరకు సీపీఐ ఆధ్వర్యంలో భూపోరాటాలను కొనసాగిస్తామని, ఇంటి స్థలాలు సాధించేంత వరకు వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీపీఐ నాయకులు పొన్నబోయిన రవి, శాఖ కార్యదర్శి పోతు ప్రవీణ్‌, తెలంగాణ ప్రజానాట్యమండలి జిల్లా ఉపాధ్యక్షుడు యాట ఉపేందర్‌, సీపీఐ మండల కార్యదర్శి చౌడబోయిన కనకయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వం పేదల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోరాట కమిటీ సభ్యులు భవాని, సంపత్‌, యాదమ్మ, సంతోష్‌, సుశీల, మౌనిక, సంధ్య, ఎల్లమ్మ, భాగ్యమ్మ, నరసమ్మ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్