Magazines

ఆయిల్‌ఫెడ్‌లో బదిలీలు

22 నిమిషాల క్రితం

Oilfed
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 06, 2026 | 1 నిమిషాల చదవడం

పరిశ్రమల పర్యవేక్షకుడిగా నాగబాబు.. అశ్వారావుపేట పరిశ్రమ మేనేజర్‌గా పవన్

నవతెలంగాణ – అశ్వారావుపేట

తెలంగాణ ఆయిల్‌ఫెడ్‌లో పలువురు అధికారులు, సిబ్బందికి బదిలీలు చేపట్టారు. ఇందులో భాగంగా అప్పారావుపేట పరిశ్రమ మేనేజర్ నాగబాబుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కల్లూరుగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పరిశ్రమల పర్యవేక్షకుడిగా ఆయనకు అదనపు హోదా కల్పించారు.


అశ్వారావుపేట పరిశ్రమ ఇంచార్జి మేనేజర్‌గా కల్లూరుగూడెం పరిశ్రమ ఇంచార్జి పవన్‌ను నియమించారు. ఈ మేరకు ఆయన అశ్వారావుపేటలో విధుల్లో చేరారు. అప్పారావుపేట పరిశ్రమ డిప్యూటీ మేనేజర్ బాణాల వెంకటేష్‌ను కల్లూరుగూడెం పరిశ్రమ ఇంచార్జిగా బదిలీ చేశారు. అలాగే బీచ్‌పల్లి మేనేజర్ బాలకృష్ణను శివరాంపల్లి ఓపీఎస్‌ (ఆయిల్ ప్యాకింగ్ స్టేషన్)కు బదిలీ చేశారు.

శివరాంపల్లి ఓపీఎస్‌లో పనిచేస్తున్న కార్తీక్‌రెడ్డిని హెడ్ఆఫీస్‌కు, హెడ్ఆఫీస్‌లో విధులు నిర్వహిస్తున్న సునీతను కపాడియాకు, అక్కడ పనిచేస్తున్న కళ్యాణ్‌గౌడ్‌ను సిద్ధిపేట నెర్మెట్‌కు బదిలీ చేసినట్లు సమాచారం.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్