Magazines

రాజకీయాలతో క్రీడాకారులకు నష్టం

32 నిమిషాల క్రితం

Politics
avatar
balaji

ప్రచురించబడింది నవం 10, 2026 | 1 నిమిషాల చదవడం

స్పోర్ట్స్‌ అథారిటీ ఈవెంట్ల ఖర్చులపై శ్వేత పత్రం విడుదల చేయాలి

శాట్ మాజీ చైర్మెన్ అల్లీపురం వెంక‌టేశ్వ‌ర్ రెడ్డి


​హైద‌రాబాద్‌: తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శాట్‌), తెలంగాణ ఒలింపిక్‌ అసోసియేషన్ (ఐఓఏ) పనితీరు, అంతర్గత రాజకీయాలతో క్రీడాకారులకు జరుగుతున్న నష్టంపై తెలంగాణ స్పోర్ట్స్‌ ‌హబ్‌ ‌బోర్డ్‌ ఆఫ్‌ ‌గవర్నర్స్‌ ‌సభ్యుడు, అర్జున అవార్డు గ్రహీత ర‌వికాంత్ రెడ్డి వ్యాఖ్యలు తెలంగాణ క్రీడారంగ దుస్థితికి అద్దం ప‌డుతున్నాయ‌ని శాట్ మాజీ చైర్మ‌న్ అల్లీపురం వెంక‌టేశ్వ‌ర్ రెడ్డి విమ‌ర్శించారు. ఓ వైపు ఖేలో ఇండియా యూత్ గేమ్స్.. మ‌రోవైపు స్పోర్ట్స్‌ అథారిటీ, ఒలింపిక్‌ ‌సంఘంలో రాజ‌కీయాలు, ముఠా త‌గాదాలతో క్రీడాకారుల‌కు న‌ష్టం జ‌రుగుతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అవినీతి అధికారులు ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు తొత్తులుగా మారి ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ర‌వికాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌కు క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహ‌రి, శాట్జ్ ఉన్న‌తాధికారులు త‌క్ష‌ణ‌మే స‌మాధానం చెప్పాల‌ని ఆయన డిమాండ్ చేశారు. గ‌త రెండేళ్ల‌లో శాట్జ్ చేప‌ట్టిన ఈవెంట్ల ఖ‌ర్చుల‌పై క్రీడాశాఖ శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేయాల‌ని కోరారు.


ఖేలో ఇండియా క్రీడ‌ల‌పై ఇటీవ‌ల‌ సీఎం రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన స‌మీక్ష‌లో క్రీడాకారులకు అందించాల్సిన ప్రోత్సాహ‌కాల‌పై శాట్జ్ అధికారుల నిర్ల‌క్ష్యాన్ని త‌ప్పుబ‌ట్టినా ప‌రిస్థితిలో మార్పు రాలేద‌ని విమ‌ర్శించారు. మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌, క్రీడాకారుల సంక్షేమాన్ని ప‌క్కనపెట్టి స్వ‌ప్ర‌యోజ‌నాలు, స్వ‌లాభాల‌కు క్రీడాశాఖ పెద్ద‌లు ప్రాధాన్య‌మిస్తున్నార‌ని మండిప‌డ్డారు. తెలంగాణ ఒలింపిక్ సంఘం ఎన్నిక‌ల ప్ర‌క్రియ స‌రిగ్గా జ‌ర‌గ‌లేద‌ని, అస‌లైన క్రీడాసంఘాలను గుర్తించి, స‌రైన‌ ఓట‌ర్లతో మ‌ళ్లీ ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని భార‌త ఒలింపిక్ సంఘం రాసిన లేఖ‌ల‌ను క్రీడాశాఖ‌, శాట్జ్ ఎందుకు తొక్కిపెట్టింద‌ని నిల‌దీశారు. ప్ర‌తిష్టాత్మ‌క ఖేలో ఇండియా క్రీడ‌ల్లో ఒలింపిక్ సంఘం, క్రీడాసంఘాల పాత్ర చాలా ముఖ్య‌మైన‌ద‌ని, త‌క్ష‌ణ‌మే టీఓఏకు ప్ర‌జాస్వామ్య‌బ‌ద్ధంగా ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని అల్లీపురం డిమాండ్‌ ‌చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్