ఐజీపీఎల్ ఫీనిక్స్ ఇన్విటేషనల్ గోల్ఫ్ టోర్నీ
నవతెలంగాణ-హైదరాబాద్ : ఏఎం గ్రీన్ ఇండియన్ గోల్ఫ్ ప్రీమియర్ లీగ్ (ఐజీపీఎల్) ఫీనిక్స్ ఇన్విటేషనల్ గోల్ఫ్ టోర్నమెంట్ ఆసక్తికరంగా మొదలైంది. వూటీ గోల్ఫ్ కౌంటీలో బుధవారం జరిగిన తొలి రౌండ్ పోటీల్లో ఫీనిక్స్ హైదరాబాద్ ఫైర్‌బర్డ్స్ గోల్ఫర్ సచిన్ బైసోయాతో పాటు గగన్‌జీత్ బుల్లార్, అర్జున్ ప్రసాద్‌లు సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. 18 హోల్స్ కోర్స్‌ను సచిన్ బైసోయా, అర్జున్ ప్రసాద్, గగన్‌జీత్ బుల్లార్‌లు సిక్స్ అండర్ 66తో ముగించారు. మిశ్రా, హర్ష్‌జీత్ సేథి, రవికుమార్‌లు ఫైవ్ అండర్ 67తో సంయుక్తంగా తర్వాతి స్థానాల్లో నిలిచారు. వూటీ గోల్ఫ్ కౌంటీలో మెరుగైన పచ్చిక, అనుకూలత పరిస్థితులు రెండో రౌండ్ పోటీలను మరింత ఆసక్తికరంగా మారుస్తున్నాయి. మూడు రౌండ్ల పోటీల అనంతరం అగ్రస్థానంలో నిలిచిన గోల్ఫర్ టైటిల్ అందుకోనున్నాడు.






కామెంట్‌లు (0)