కావా మెన్స్ వాలీబాల్ లీగ్ 2026
భువనేశ్వర్ (ఒడిశా) : సెంట్రల్ ఏసియా వాలీబాల్ అసోసియేషన్ (కావా) ఆధ్వర్యంలో జరుగుతున్న పురుషుల వాలీబాల్ లీగ్‌లో ప్రైమ్ వాలీబాల్ లీగ్ జట్టు తెలుగు బ్లాక్‌హాక్స్ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. భువనేశ్వర్‌లోని కళింగ యూనివర్శిటీ వేదికగా శుక్రవారం జరిగిన ఆఖరు లీగ్ మ్యాచ్‌లో తెలుగు బ్లాక్‌హాక్స్ 3-1తో ముంబై మీటియర్స్‌పై గెలుపొందింది. తొలి సెట్లో 20-25తో బ్లాక్‌హాక్స్ వెనుకంజ వేసినా.. 25-19, 25-22, 25-18తో పుంజుకుని విజేతగా నిలిచింది. ప్రతిష్టాత్మక క్లబ్ వాలీబాల్ లీగ్‌లో బ్లాక్‌హాక్స్ సెమీస్‌కు చేరటం గర్వకారణమని ఆ జట్టు యజమాని కంకణాల అభిషేక్ రెడ్డి అన్నారు.







కామెంట్‌లు (0)