Magazines

ఇద్దరు అటు, ఇద్దరు ఇటు

22 గంటల క్రితం

ipl
avatar
balaji

ప్రచురించబడింది నవం 05, 2026 | 1 నిమిషాల చదవడం

సన్‌‌రైజర్స్‌, సూపర్‌‌కింగ్స్‌ ‌ప్లేయర్స్‌ ‌ట్రేడింగ్‌

హైదరాబాద్‌ : ఇండియన్‌ ‌ప్రీమియర్‌ ‌లీగ్‌ (ఐపీఎల్‌) 20వ సీజన్‌ ‌ముంగిట మాజీ చాంపియన్లు చెన్నై సూపర్‌‌కింగ్స్‌, సన్‌‌రైజర్స్‌ ‌హైదరాబాద్‌ ‌ప్లేయర్‌ ‌ట్రేడింగ్‌ ‌చేసుకున్నాయి. లియాం లివింగ్‌‌స్టోన్‌, జాక్‌ ఎడ్వర్డ్స్‌‌ను సన్‌‌రైజర్స్‌ ‌నుంచి సూపర్‌‌కింగ్స్‌ ‌తీసుకోగా.. ఖలీల్‌ అహ్మద్‌, నాథన్‌ ఎలిస్‌‌ను సూపర్‌‌కింగ్స్‌ ‌నుంచి సన్‌‌రైజర్స్‌ ‌సొంతం చేసుకుంది. ఖలీల్‌ అహ్మద్‌ ‌రూ.4.8 కోట్లు, నాథన్‌ ఎలిస్‌ ‌రూ.2 కోట్లకు సన్‌‌రైజర్స్‌ ‌గూటికి చేరారు. లివింగ్‌‌స్టోన్‌‌ను సన్‌‌రైజర్స్‌ ‌వేలంలో రూ.13 కోట్లకు కొనుగోలు చేయగా.. అతడికి చెన్నై సూపర్‌‌కింగ్స్‌ ‌రూ. 6 కోట్లు ఇవ్వనుంది. జాక్‌ ఎడ్వర్డ్స్‌ ‌రూ. 3 కోట్లకు సూపర్‌‌కింగ్స్‌‌కు ఆడనున్నాడు. ఐపీఎల్‌ ‌ప్రాంఛైజీలు ఆటగాళ్ల రిటెన్షన్‌ ‌జాబితాను ప్రకటించేందుకు నవంబర్‌ 17 ‌తుది గడువు కాగా, డిసెంబర్‌ 16న గోవాలో ఐపీఎల్‌ ‌మినీ ఆటగాళ్ల వేలం షెడ్యూల్‌ చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్