Magazines

ఇళ్లను అప్ గ్రేడ్ చేయడం చూస్తున్న అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026

1 గంట క్రితం

Amazon
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 22, 2026 | 6 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : భారతదేశం దీపావళి కోసం సిద్ధమవుతున్న కారణంగా  కస్టమర్లు తమ ఇళ్లను కిచెన్ నుండి లివింగ్ రూమ్ , బెడ్రూం మరియు అవుట్ డోర్స్ వరకు నవీకరణ చేస్తున్న కారణంగా  కొనుగోలు పరిమాణం 3 రెట్లు కంటే ఎక్కువ వృద్ధితో ఈ అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026 శక్తివంతమైన ధోరణుల్లో ఒకటిగా హోమ్ అప్ గ్రేడ్స్ అభివృద్ధి చెందింది. ఈ ధోరణి కేవలం మెట్రోలకు మాత్రమే పరిమితం కాదు. లక్నో, జైపూర్, పాట్నా, గౌహతి, కోయంబత్తూరు, నాగపూర్, ఇండోర్ మరియు కొచ్చీ మొదలైన మెట్రోయేతర నగరాలు కూడా Amazon.inలో కొనుగోలు పరిమాణంలో 60% ఉన్నాయి. కస్టమర్లు ఇంతకు ముందు కొనుగోలు చేయని శ్రేణుల్లోకి ప్రవేశిస్తున్న కారణంగా  మెట్రోయేతర నగరాలు మెట్రోల కంటే రెండు రెట్లు వేగంగా వృద్ధి చెందుతున్నాయి.

 

"ఈ పండగ సీజన్ లో  తమ ఇళ్లను నిజమైన ఆత్మవిశ్వాసంతో , ప్రజలు కొత్త టెక్నాలజీతో అప్ గ్రేడ్ చేయడం మేము చూస్తున్నాం మరియు ఈ వృద్ధిలో అత్యదిక భాగం మెట్రోయేతర పట్టణాల నుండి వస్తోంది. AI-ఆధారిత కుకింగ్ ఉపకరణాలు, రోబోటిక్ క్లీనర్లు, ఎయిర్ ప్యూరిఫైర్లు మరియు కనక్టెడ్ లైటింగ్ లు ఆ మార్పుకు ఆధిపత్యంవహిస్తున్నాయి. కస్టమర్లు ప్రీమియం ఉత్పత్తులను ఎంచుకుంటున్నారు మరియు భారీ కొనుగోళ్లతో మాపై విశ్వాసం చూపిస్తున్నారు మరియు నో -కాస్ట్ ఈఎంఐ, ఎక్స్ ఛేంజ్ ఆఫర్లు మరియు తక్షణ బ్యాంక్ డిస్కౌంట్లు వంటి కొనుగోలు శక్తికి వీలు కల్పంచేవి ఆ చర్యను మరింత సులభం చేసాయి, స్మార్ట్ ఉపకరణాలపై ఫైనాన్సింగ్ కాటగిరీ సగటు కంటే ఎక్కువగా కొనసాగుతున్నాయి. ప్రముఖ బ్రాండ్స్ నుండి విస్తృతమైన ఎంపికతో, సింగిల్ ఉత్పత్తుల నుండి పూర్తి గదుల వరకు తరలుతున్నారు మరియు మొదటిసారి వారు కొనుగోలు చేస్తున్న శ్రేణులను అన్వేషిస్తున్నారు. రూఫస్ సరైన ఫిట్ ను కనుగొనడంలో వారికి సహాయపడుతోంది, నలుగురు ఉన్న కుటుంబానికి ఏ ఎయిర్ ఫ్రైయర్ అనుకూలమైనది వంటి ప్రశ్నలకు వారు తమ స్నేహితులను అడిగిన విధానంలో ప్రశ్నలకు  జవాబులను హింగ్లిష్ లేదా తమ సొంత భాషలో జవాబులు ఇస్తుంది. కస్టమర్లు ఎక్కడ నివసిస్తున్నా వారి ఇంటి ముంగిటకు అత్యంత వేగంగా డెలివరీలను తేస్తుంది, " అని అమన్ దీప్ లోహన్, డైరక్టర్- హోమ్, కిచెన్ మరియు అవుట్ డోర్స్, అమేజాన్ ఇండియా అన్నారు.

 

కస్టమర్లు కిచెన్ ఉపకరణాల్లో ఎయిర్ ఫ్రైయర్లు మరియు ఓవెన్లు నుండి రిఫ్రిజిరేటర్లు మరియు డిష్ వాషర్ల వరకు కిచెన్ ఉపకరణాలు కొనుగోలు చేస్తున్నారు

కిచెన్ శ్రేణిలో, ఉపకరణాల కాటగిరి 3.4 రెట్లు సగటు-రోజు వేగంతో పెరుగుతోంది. సాధారణ రోజుతో పోల్చినప్పుడు స్మార్ట్ మరియు చిన్న ఉపకరణాలు 4.5 రెట్లు ఆధిపత్యంవహిస్తున్నాయి. ఈ శ్రేణులు కిచెన్ కాటగిరి కోసం మొత్తం షాపింగ్ పరిమాణంలో 70% కంటే ఎక్కువగా తోడ్పడతాయి. వినియోగదారులు వివరణల కుకింగ్ ఉపకరణాలకు అప్ గ్రేడ్ అవుతుండటంతో  ఎయిర్ ఫ్రైయర్స్ తమ  సగటు-రోజువారీ  వేగం కంటే  7.5 రెట్లు, ఓవెన్లు 5.2 రెట్లు వృద్ధిని సాధిస్తున్నాయి. అత్యంత వేగంగా అమ్ముడవుతున్న బ్రాండ్స్ లో ఫిలిప్స్ మరియు షార్క్ నింజా సాధారణ రోజులకంటే  7 రెట్లు కంటే ఎక్కువగా వృద్ధిని నమోదు చేసాయి.  Espresso మెషీన్లు తమ సగటు -రోజూవారీ వేగం కంటే చాలా రెట్లు అధిక వృద్ధిని సాధిస్తున్నాయి. వీటిలో De'Longhi 5 రెట్ల వృద్ధితో అగ్రస్థానంలో ఉంది. పెద్ద కిచెన్ ఉపకరణాల్లో, అధిక సామర్థ్యంగల రిఫ్రిజిరేటర్లు అనగా 300L కంటే ఎక్కువ సామర్థ్యం గల రిఫ్రిజిరేటర్లు తమ సగటు-రోజూవారీ వేగం కంటే 34 రెట్లు వృద్ధిని సాధిస్తున్నాయి, వీటిలో శామ్ సంగ్, LG, Haier  మరియు బాష్ నుండి ఫ్రాస్ట్-ఫ్రీ మరియు సైడ్-బై-సైడ్ మోడల్స్ అగ్రస్థానంలో ఉన్నాయి. శామ్ సంగ్ 653L సైడ్-బై-సైడ్ AI-ఆధారిత స్మార్ట్ రిఫ్రిజిరేటర్ 33 రెట్లు తమ సగటు-రోజూవారీ వేగంతో వృద్ధిని సాధిస్తున్నాయి. పెద్ద గృహోపకరణాల విభాగంలో కొత్త కాటగిరిలు పేరు సంపాదిస్తున్నాయి. డిష్ వాషర్లు వాటి సగటు రోజూవారీ అమ్మకాల కంటే 7 రెట్లు, చిమ్నీలు 6 రెట్లు అధిక అమ్మకాలను నమోదు చేస్తున్నాయి. ఇది జీవనశైలికి అనుకూలంగా ఉండే కిచెన్ ఉపకరణాల వినియోగం పెరుగుతోందని సూచిస్తోంది. ఆక్వాగార్డ్ ఆధ్వర్యంలో స్మార్ట్ వాటర్ ప్యూరిఫైయర్స్ వాటి సగటు రోజూవారీ అమ్మకాల కంటే సుమారు 3 రెట్లు ఎక్కువ అమ్మకాలను నమోదు చేస్తున్నాయి. ఆటో షట్-ఆఫ్ సౌకర్యం ఉన్న స్మార్ట్ గ్యాస్ స్టవ్స్ మరియు ఇండక్షన్ కుక్ టాప్స్ కూడా ఆదరణ పొందుతున్నాయి.

 

 పెద్ద స్క్రీన్స్ నుండి కనక్టెడ్ లైటింగ్ మరియు క్లీనర్ ఎయిర్ వరకు లివింగ్ రూమ్ అప్ గ్రేడ్ కొనసాగుతోంది

కస్టమర్లు పెద్ద స్క్రీన్స్ నుండి ఎక్కువ కనక్ట్ చేయబడిన ప్రదేశాలకు తరలిన కారణంగా లివింగ్ రూమ్ లో అప్ గ్రేడ్ అత్యంత స్పష్టంగా కనిపిస్తోంది. స్మార్ట్ టివిలు, స్పీకర్లు మరియు యాక్ససరీస్ వంటి ఎంటర్టైన్మెంట్ డివైజ్ లు మార్గదర్శకంగా నిలిచాయి, తమ సగటు-రోజూవారీ వేగంలో 37 రెట్లు  ఎక్కువగా పెరిగాయి. స్మార్ట్ టివిలు ఈ వృద్ధిలో 65%కి తోడ్పడ్డాయి. ఎందుకంటే కస్టమర్లు పెద్ద స్క్రీన్స్ మరియు కొత్త డిస్ ప్లే మరియు AI ఆధారిత ఫీచర్లను ఎంచుకుంటున్నారు.  శామ్ సంగ్,  Xiaomi  మరియు TCL వంటి బ్రాండ్స్ ఉమ్మడిగా 56 రెట్లు వృద్ధిని సాధిస్తుండగా, దేశీయంగా వృద్ధి చెందిన D2C బ్రాండ్ లూమియో 42 రెట్లు ఎక్కువగా ఈ సమయంలో వృద్ధి చెందింది.   ఇళ్లను సులభంగా నిర్వహించే ఉపకరణాలను కూడా కొనుగోలు చేస్తున్నారు. వీటిలో ఇకోవాక్స్ 13 రెట్లు మరియు డ్రీమ్ 7 రెట్లు మార్గదర్శకత్వంలో  రోబోటిక్ వేక్యూం క్లీనర్లు వాటి సగటు రోజూవారీ వేగం కంటే 9.2 రెట్లు పెరిగాయి. ఎయిర్ ప్యూరిఫైయర్లు 5.2 రెట్లు, మరియు శక్తిని పొదుపు చేసే స్మార్ట్ ఫ్యాన్లు 4 రెట్లు పెరిగాయి. మరొక స్వదేశీ D2C బ్రాండ్ అటమ్ బర్గ్ అమ్మకాలు 5 రెట్లు పెరిగాయి. దీపావళికి ముందు ఈ మార్పుకు కనక్టెడ్ లైటింగ్ కూడా జోడించబడుతోంది. ఫిలిప్స్ మరియు విప్రో మార్గదర్శకత్వంలో దీని అమ్మకాలు సగటు రోజూవారీ వేగం కంటే 3.3 రెట్లు పెరిగాయి. వినియోగదారులు కేవలం బల్బ్స్ నుండి వాయిస్, యాప్ మరియు రంగుల నియంత్రణతో కూడిన సర్ఫేస్ లైట్లు, బ్యాటెన్స్ వంటి పూర్తి ఫిక్సర్స్ కు మారుతున్నారు.

 

కస్టమర్లు గృహోపకరణాల్లో సామర్థ్యం కోసం  ఉన్నతమైన  ఉపకరణాలను ఎంచుకుంటున్నారు

హోమ్ లో కస్టమర్లు రోజూవారీ జీవితాన్ని సులభతరం చేసే పెద్ద ఉపకరణాల్లో పెట్టుబడి పెడుతున్నారు. అమేజాన్ గ్రేట్ ఇండియన్ పెస్టివల్ 2026 యొక్క తొలి రోజుల సమయంలో ఈ విభాగం 25 రెట్లు పెరుగుతోంది. వాషింగ్ మెషీన్లు ప్రత్యేకమైన శ్రేణులుగా నిలుస్తున్నాయి. వాషర్ డ్రైయర్లు తమ సగటు-రోజూవారీ వేగంలో 18 రెట్లు వృద్ధిని సాధిస్తుండగా, ప్రీమియం ఫ్రంట్-లోడ్ మోడల్స్ అత్యంత ఆదరణ పొందాయి. LG అత్యంత బెస్ట్-సెల్లింగ్ బ్రాండ్ గా నమోదైంది, తమ సాధారణ రోజుల సేల్స్  కంటే  17 రెట్లు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. ఎయిర్ కండిషనర్స్ కూడా వేగంగా అమ్ముడవుతున్నాయి, నాలుగు మరియు అయిదు-స్టార్ ఎనర్జీ రేటు గల మోడల్స్ 15 రెట్లు తమ సగటు రోజూవారీ అమ్మకాల కంటే వేగంగా అమ్ముడవుతున్నాయి. వీటిలో పనసోనిక్ , హిటాచీ మరియు డైకిన్ వంటి బ్రాండ్స్ అగ్ర స్థానంలో నిలిచాయి. అన్ని ఉపకరణాల శ్రేణుల్లో, కస్టమర్లు ఎక్స్ ఛేంజ్ డిస్కౌంట్లు, తక్షణ బ్యాంక్ డిస్కౌంట్లు మరియు  రోజుకు రూ.99కి ప్రారంభమయ్యే నో-కాస్ట్ ఈఎంఐ వంటి కొనుగోలు సామర్థ్యాన్ని ఇచ్చి తమ ప్రస్తుతమున్న ఉపకరణాలను అప్ గ్రేడ్ చేసే అవకాశాలను  చురుకుగా ఉపయోగిస్తున్నారు. ఇవి వారి కొనుగోలు సామర్థ్యాన్ని శక్తివంతం చేస్తున్నాయి. హోంలో ఈ ధోరణి కనిపిస్తోంది. ఎందుకంటే కస్టమర్లు కేవలం పాత వాటిని మార్చడమే కాకుండా, మరింత మెరుగైన సామర్థ్యం కలిగిన ఉన్నత శ్రేణి నమూనాలను ఎంచుకుంటున్నారు.

 

తెలివైన పండగ షాపింగ్ అనుభవం కోసం AI-ఆధారిత ఆవిష్కరణ

ఈ పండగ సీజన్ లో వేగంగా కనుగొనడం మరియు  ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు చేయడానికి రూపొందించబడిన AI-ఆధారిత సాధనాలతో Amazon.in షాపింగ్ ను సరళంగా మరియు సహజంగా చేసింది. Rufusతో, కస్టమర్లు హింగ్లిష్ సహా 8 భారతీయ భాషల్లో తమకు అవసరమైన వాటిని సహజమైన ప్రాంప్ట్స్ అయిన  “ బెడ్రూం కోసం రూ.1,500 లోపు నిశ్యబ్దంగా పని చేసే ఎయిర్ ప్యూరిఫైర్  నాకు చూపించు” వంటి పొందవచ్చు కాగా కేవలం ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ లో ఫోటో తీయడం ద్వారా ఉత్పత్తులను తక్షణమే కనుగొనే సౌకర్యాన్ని Lens AI ద్వారా కస్టమర్లు పొందవచ్చు. 30 నుండి  1 సంవత్సరం ధరల చరిత్రతో తెలివైన ధరల ట్రాకింగ్ ను కూడా రూఫస్ అందిస్తుంది మరియు కావలసిన వస్తువు ధరల లక్ష్యాన్ని చేరుకున్నప్పుడు మీ కొనుగోలును పూర్తి చేయడానికి డీల్ అలర్ట్స్  కస్టమర్లకు తెలియచేస్తుంది. కాబట్టి కస్టమర్లు ప్రీమియం రిఫ్రిజిరేటర్ లేదా వాషింగ్ మెషీన్ కోసం వేచి ఉన్నప్పుడు ఉత్తమమైన పండగల ధరకు అనుగుణంగా కొనుగోలు చేయవచ్చు.  6 మిలియన్ ల కంటే ఎక్కువమంది కస్టమర్లు డీల్ అలర్ట్స్ ను వినియోగించి ధరలను అనుసరించారు మరియు సరైన సమయంలో కొనుగోలు చేసారు.  AI రివ్యూ హైలైట్స్, క్విక్ లెర్న్ మరియు బైయ్యింగ్ గైడ్స్ వంటి ఫీచర్లు  మోడల్స్ ను పోల్చడానికి మరియు వివరణలను అర్థం చేసుకోవడాన్ని సులభతరం చేసాయి, హోమ్ పేజీ యొక్క మరింత వ్యక్తిగత ప్రాధాన్యతలు ప్రతి కస్టమర్ అన్వేషిస్తున్న ఆధారంగా సంబంధిత ఉత్పత్తులను పంపిస్తాయి.

 

ద అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ పండగ సీజన్ అంతటా కొనసాగుతుంది. కస్టమర్లకు కొత్త డీల్స్ మరియు ఆఫర్లు తెస్తోంది, ప్రైమ్ సభ్యుల కోసం అదనపు ఆదాలు తెస్తోంది మరియు అమేజాన్ లో ఇప్పటి వరకు అత్యంత వేగవంతమైన పండగ డెలివరీలు అందిస్తోంది. ఈ దీపావళికి, కస్టమర్లు కిచెన్, హోమ్, టాయ్స్ మరియు అవుట్ డోర్ ఉత్పత్తులతో పాటు 1 లక్ష ఉత్పత్తులపై మొత్తం 50% తగ్గింపును మరియు రెండు లక్షలకు పైగా ఉత్పత్తులపై సంవత్సరంలోనే అత్యంత తక్కువ ధరలను  పొందవచ్చు. వీటితో పాటు స్మార్ట్ ఫోన్స్, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, బ్యూటీ , నిత్యావసరాలు మరియు ఎన్నో వాటిపై కూడా ఆదా చేసుకోవచ్చు. విస్తృతమైన ఎంపికతో కూడిన ఉత్పత్తులు అత్యంత వేగంగా డెలివరీ చేయబడతాయి. బ్యాంక్ మరియు చెల్లింపు ఆఫర్లు ద్వారా అదనపు ప్రయోజనం లభిస్తుంది. కస్టమర్లు ఏక్సిస్ బ్యాంక్ మరియు ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ మరియు క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై 10% తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు. అమేజాన్ పే ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కలిగిన వారు  ప్రైమ్ సభ్యుల కోసం ఇప్పటికే ఉన్న 5% కంటే అదనంగా 5% క్యాష్ బాక్ మరియు నాన్-ప్రైమ్ సభ్యులు 3% పొందవచ్చు. అమేజాన్ పే లేటర్ కస్టమర్లు కొనుగోళ్లను సులభ ఈఎంఐలుగా కొనుగోళ్లను మార్చే సరళతతో 10% క్యాష్ బాక్ సంపాదించవచ్చు లేదా రాబోయే నెలలో పూర్తి మొత్తం చెల్లించవచ్చు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్