Magazines

సిటీలమ్‌ ఇండియాలో 100 శాతం వాటా కొనుగోలు చేసిన క్రిస్టల్‌

1 గంట క్రితం

Krystal
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 22, 2026 | 2 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : భారతదేశ వ్యాప్తంగా  సమగ్ర ఫెసిలిటీ మేనేజ్‌మెంట్‌, సిబ్బంది నియామక పరిష్కారాలు, భద్రతా సేవలు, క్యాటరింగ్‌, వ్యర్థాల నిర్వహణ సేవలను అందిస్తున్న క్రిస్టల్‌ ఇంటిగ్రేటెడ్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (కేఐఎస్‌ఎల్‌),  ఫ్రాన్స్‌ ప్రభుత్వ యాజమాన్యంలోని ఈడీఎఫ్‌ గ్రూప్‌కు చెందిన ప్రస్తుత వాటాదారుల నుంచి సిటీలమ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (సిటీలమ్‌ ఇండియా)లో 100 శాతం ఈక్విటీ వాటాను కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. ఇందులో సిటీలమ్‌ ఎస్‌ఏఎస్‌, ఫ్రాన్స్‌ కూడా ఉంది. ఈ కొనుగోలుతో సిటీలమ్‌ ఇండియా, క్రిస్టల్‌ ఇంటిగ్రేటెడ్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌కు పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థగా మారనుంది.

ఈ కొనుగోలుతో సిటీ లైటింగ్‌, పట్టణ మౌలిక సదుపాయాల విభాగంలోకి క్రిస్టల్‌ ప్రవేశిస్తోంది. రానున్న మూడేళ్ల నుంచి నాలుగేళ్లలో ఈ కొత్త విభాగం ద్వారా ఏటా రూ.300-350 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మౌలిక సదుపాయాల సేవల విభాగం ద్వారా సమీకృత ఆదాయంలో 12-15 శాతం వాటా లభిస్తుందని అంచనా వేస్తోంది.

ఈ కొనుగోలుపై క్రిస్టల్‌ ఇంటిగ్రేటెడ్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ సీఈఓ, హోల్‌టైమ్‌ డైరెక్టర్‌ సంజయ్‌ దీఘే మాట్లాడుతూ “సిటీ లైటింగ్‌, పట్టణ మౌలిక సదుపాయాల సేవల విభాగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సిటీలమ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ను కొనుగోలు చేయడం ద్వారా మౌలిక సదుపాయాలకు అనుబంధంగా ఉన్న సేవల విభాగంలో క్రిస్టల్‌ ఇంటిగ్రేటెడ్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ వ్యూహాత్మక ముందడుగు వేసింది.

సిటీలమ్‌ ఇండియా ప్రస్తుతం  వీధి దీపాలు, నగరాల లైటింగ్‌ మౌలిక సదుపాయాల రూపకల్పన, ఇంజినీరింగ్‌, ఏర్పాటు, నిర్వహణ సేవలను అందిస్తోంది. ఈ కొనుగోలు ద్వారా సిటీలమ్‌ ఇండియాకు ఉన్న సాంకేతిక సామర్థ్యాలను, సమగ్ర సేవలు, సాంకేతిక నిర్వహణలో క్రిస్టల్‌కు ఉన్న కార్యకలాపాల బలంతో అనుసంధానించేందుకు వీలవుతుంది” అని తెలిపారు.

ఈ కొనుగోలుపై సిటీలమ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సీఈఓ, డైరెక్టర్‌ బి. శివకుమార్‌ మాట్లాడుతూ.. “క్రిస్టల్‌ ఇంటిగ్రేటెడ్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ కొనుగోలు సిటీలమ్‌ ఇండియా వృద్ధి ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయి. ఇప్పుడు క్రిస్టల్‌ గ్రూప్‌లో భాగం కావడం ద్వారా ఈ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసుకుని విస్తరించుకునే అవకాశం లభిస్తోంది. క్రిస్టల్‌ బృందంతో కలిసి పనిచేస్తూ కంపెనీ దీర్ఘకాలిక వృద్ధి వ్యూహానికి తోడ్పడేందుకు ఎదురుచూస్తున్నాం. వేగంగా మారుతున్న సాంకేతికత, కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత పరివర్తన కాలంలో అర్థవంతమైన ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు కూడా ఈ కొనుగోలు అవకాశం కల్పిస్తోంది” అని పేర్కొన్నారు.


 

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్