Magazines

హ్యుందాయ్ బాయోన్‌తో లభించే సురక్షిత ప్రయాణం

2 గంటల క్రితం

Hyundai BAYON
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 21, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ హైదరాబాద్: హ్యుందాయ్ మోటార్ ఇండియా తన నూతన యుటిలిటీ వాహనం 'హ్యుందాయ్ బాయోన్' భద్రతా ఫీచర్లను వెల్లడించింది. గ్లోబల్ కే ఎన్‌హాన్స్డ్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మితమైన ఈ వాహనం భారతీయ 5-స్టార్ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా రూపుదిద్దుకుంది. దీని బాడీ నిర్మాణంలో 69% అడ్వాన్స్‌డ్ హై-స్ట్రెంగ్త్ స్టీల్ ఉపయోగించడం వల్ల ప్రమాద సమయాల్లో ప్రయాణికులకు గరిష్ట రక్షణ లభిస్తుంది. ఈ కారులో 80 కంటే ఎక్కువ అడ్వాన్స్‌డ్, 35 కంటే ఎక్కువ ప్రామాణిక భద్రతా ఫీచర్లు ఉన్నాయి. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, TPMS వంటివి ప్రామాణికంగా వస్తున్నాయి.

భద్రతలో ప్రధానాకర్షణగా 23 రకాల ఫీచర్లు కలిగిన 'హ్యుందాయ్ స్మార్ట్‌సెన్స్ లెవెల్ 2 ప్రో ఏడాస్' (ADAS) వ్యవస్థ ఉంది. ఇది లేన్ కీపింగ్, ప్రాంట్ కొలిజన్ అవాయిడెన్స్, హైవే డ్రైవింగ్ అసిస్ట్ మరియు స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్ ద్వారా ప్రమాదాలను ముందస్తుగా నివారిస్తుంది. అలాగే సరౌండ్ వ్యూ మానిటర్, బ్లైండ్-స్పాట్ వ్యూ మానిటర్, మరియు సెన్సార్లు ఇరుకైన ప్రాంతాల్లో సురక్షిత డ్రైవింగ్‌కు తోడ్పడతాయి. మోనోటోన్, డ్యూయల్-టోన్, మ్యాట్ విభాగాల్లో 10 రంగులలో లభించే ఈ కారు భారతదేశంలో 2026 అక్టోబర్ 26న విడుదల కానుంది. వినియోగదారులు రూ. 11,000 చెల్లించి వెబ్‌సైట్ లేదా డీలర్‌షిప్‌లలో బుక్ చేసుకోవచ్చు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్