Magazines

ప్రపంచవ్యాప్తంగా వెబ్‌సైట్ల షట్‌డౌన్

2 గంటల క్రితం

Shutdown of websites worldwide
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 22, 2026 | 1 నిమిషాల చదవడం

అనేక దేశాల్లో ఇంటర్నెట్‌పై 70 శాతం వరకూ ప్రభావం

పీహెచ్‌పీ సాఫ్ట్‌వేర్‌లో అత్యంత ప్రమాదకరమైన

రెండు కొత్త లోపాలు..ఏఐ గుర్తింపు

న్యూఢిల్లీ: ప్రముఖ లాంగ్వేజ్ పీహెచ్‌పీలో తీవ్రమైన భద్రతా లోపాలు బయటపడడంతో ప్రపంచవ్యాప్తంగా బుధవారం అనేక దేశాల ప్రభుత్వ వెబ్‌సైట్లతో పాటు పలు ప్రముఖ వెబ్‌సైట్లు ఒకేసారి షట్‌డౌన్ అయ్యాయి. పీహెచ్‌పీ సాఫ్ట్‌వేర్‌లో అత్యంత ప్రమాదకరమైన రెండు కొత్త లోపాలను ఏఐ బయటపెట్టింది. వీటికి 10కి గాను 9.2 తీవ్రత రేటింగ్ ఇచ్చారు. ఈ లోపాలు అనేక దేశాలలో ఇంటర్నెట్‌పై 70 శాతం వరకూ ప్రభావం చూపాయి. తాజా పరిణామంతో హ్యాకర్లు ఆయా వెబ్‌సైట్లను తమ అధీనంలోకి తీసుకోకుండా అడ్డుకోవడానికి పలు దేశాలు ముందు జాగ్రత్త చర్యగా తమ సైట్లను ఆఫ్‌లైన్ చేశాయి. నెదర్లాండ్స్, ఫ్రాన్స్, ఫిన్లాండ్, జర్మనీ, బెల్జియం, కెనడా వంటి దేశాలు ప్రభుత్వ పోర్టల్స్‌ను, ఆంతరంగిక పరిపాలన, పాఠశాల కమ్యూనికేషన్ వెబ్‌సైట్లను తాత్కాలికంగా మూసివేశాయి. ప్రపంచంలోనే అతి పెద్ద సమాచార వేదిక వికీపీడియా కూడా కొద్దిసేపు నిలిచిపోయింది. ఉత్తర కొరియాకు చెందిన దాదాపు అన్ని ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్లు రోజంతా ఆఫ్‌లైన్‌లోకి వెళ్లిపోయాయి. లోపాలను సరిదిద్దిన అనంతరం వెబ్‌సైట్లు తిరిగి తెరుచుకున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్