నవతెలంగాణ-హైదరాబాద్ : ఈ దీపావళికి దేశంలోని పండగ షాపింగ్ కార్టులు చెబుతున్న మాట ఒక్కటే. సంబరాల్లో ఇంకొంచెం మెరుపుకు ఎప్పుడూ చోటు ఉంటుంది. ఇంటిని దీపాలతో అలంకరించడం, లక్ష్మీ పూజకు సిద్ధం కావడం, ధన్‌తేరస్‌కు బంగారం, వెండి కొనడం, పండగ స్వీట్లు, ప్రేమతో ఇచ్చే బహుమతులు వరకు అన్నింటికీ ఇన్స్టామార్ట్తో ప్రజలు ముందుగానే సంబరాలు మొదలుపెట్టారు.
ఇంటిని దీపావళికి సిద్ధం చేసే చిన్న చిన్న విషయాల్లోనే పండగ సందడి కనిపిస్తోంది. కొవ్వొత్తులు, బంతిపూల కోసం వెతికేవారు గత ఏడాదితో పోలిస్తే దాదాపు 200% పెరిగారు. దీపావళి గిఫ్ట్ హ్యాంపర్ల మీద ఆసక్తి సుమారు 300% పెరిగింది. పండగకు బహుమతులు ఇవ్వాలనే ఇష్టం పెరుగుతోందని ఇది చూపిస్తోంది. దీపాలు, అలంకరణ లైట్లు, తాజా పూలు, ముగ్గుల సామాగ్రి, పూజా సామాన్ల వరకు ఇంట్లో ప్రతి మూలకూ పండగ కళ తెచ్చేందుకు ప్రజలు ఎన్నో దారులు వెతుకుతున్నారు.
దీపావళి వారాంతం మొదలవుతున్న వేళ, ఏర్పాట్లు చాలా రోజులుగా సాగుతున్నాయి.
సంఖ్యల్లో ధన్తేరస్ బంగారం జోరు
శుభానికి బంగారమే మొదటి ఎంపిక: ధన్‌తేరస్‌కు ముందు వారంలో బంగారు నాణేల ఆర్డర్లు 23 రెట్లు పెరిగాయి. ఒక గ్రాము బంగారు నాణేలకు ఎక్కువ ఆదరణ దక్కింది. తర్వాత స్థానంలో అర గ్రాము నాణేలు ఉన్నాయి.
మెరిసే నగరాలు: బంగారు నాణేల కొనుగోళ్లలో బెంగళూరు మొదటి స్థానంలో నిలిచింది. తర్వాత హైదరాబాద్, ముంబై ఉన్నాయి. వెండి నాణేల ఆర్డర్లలో ఢిల్లీ అగ్రస్థానంలో ఉంది.
వెండికీ తనదైన మెరుపు: ధన్‌తేరస్‌కు ముందు వారంతో పోలిస్తే వెండి నాణేల ఆర్డర్లు 7 రెట్లు పెరిగాయి. 5 గ్రాములు, 10 గ్రాముల నాణేలకు దాదాపు సమానంగా ఆదరణ వచ్చింది. లక్ష్మీ-గణేశుల డిజైన్లు పండగ ఎంపికల్లో ముందున్నాయి.
ఇంటి లక్ష్మికి, ఇంటికి కొత్త కళ: వంటగది, భోజన సామాన్ల ఆర్డర్లు 45% పెరిగాయి. డిన్నర్ సెట్లు 344%, ప్రెజర్ కుక్కర్లు 171% పెరిగాయి.
ధన్‌తేరస్‌కు ముందు అతి పెద్ద సింగిల్ కార్టులు: ఒక కస్టమర్ ఒకే కార్టులో లక్ష్మీదేవి ముద్ర ఉన్న 1 గ్రాము బంగారు నాణేలను చాలా ఆర్డర్ చేశారు. వాటి మొత్తం విలువ ₹1.73 లక్షలు. బెంగళూరు, అహ్మదాబాద్‌కు చెందిన చాలామంది ఒకే కార్టులో 10 గ్రాముల 24 క్యారెట్ బంగారు నాణేలను ఎంచుకున్నారు.
ధన్‌తేరస్‌కు ముందు ఒక్కొక్కరు పెట్టిన అతిపెద్ద ఖర్చులు: నోయిడాకు చెందిన ఒక కస్టమర్ తొమ్మిది ఆర్డర్లలో బంగారు నాణేల కోసం దాదాపు ₹5 లక్షలు ఖర్చు చేసి జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు. తర్వాత ముంబైకి చెందిన ఒకరు బంగారం, వెండి నాణేల కోసం ఏకంగా ₹4.31 లక్షలు ఖర్చు చేశారు. అందులో ₹14,950 వెండి నాణేలకు. వరంగల్‌కు చెందిన ఒక కస్టమర్ 5 ఆర్డర్లలో ₹3.86 లక్షల విలువైన బంగారు నాణేలు కొన్నారు.
లైట్స్, కెమెరా, సెలబ్రేషన్: దీపావళికి కొత్త కళతో మెరిసిపోతున్న భారత్
గుమ్మానికి బంతిపూల తోరణాలు లేకుండా, ఇంట్లో బంతిపూల సువాసన లేకుండా దీపావళి పూర్తవదు.
పూలు, తోరణాలు: పూల ఆర్డర్లు 42% పెరిగాయి. బంతిపూలు, పూల మాలలు, బొకేలు ఇప్పటికే దీపావళికి ముందు జరిగే పార్టీలకు పండగ అందాన్ని ఇంటికి తెచ్చేశాయి.
దీపం వెలిగె, ఇల్లు మెరిసె: పూజ ప్రమిదలు 45%, LED దీపాల లైట్లు 88% పెరిగాయి.
స్వీట్లు లేకుండా ఎలా! భారతీయులు ఇప్పుడే కేలరీలు లెక్క పెట్టడం లేదని స్పష్టంగా తెలుస్తోంది. స్వీట్ ఆర్డర్లు ఇప్పటికే 55% కంటే ఎక్కువ పెరిగాయి. లడ్డూ, సోన్ పాపడి, కాజూ కత్లీ, గులాబ్ జామూన్, పేడా ముందు వరుసలో ఉన్నాయి.
స్వీట్లలో ఏముంది? ప్రతి నగరానికీ తనదైన దీపావళి మెనూ
ఒకే దేశం, ఎన్నో రుచులు. లడ్డూ, కాజూ కత్లీకి అన్ని చోట్లా అభిమానులు ఉన్నా, ప్రతి నగరానికీ తనదైన ఇష్టం ఉంది:
చెన్నై: స్వీట్ ఆర్డర్లలో గులాబ్ జామూన్ ముందు నిలిచింది. స్నాక్స్‌లో సీడై ఎక్కువగా ఎంచుకున్నారు
అహ్మదాబాద్, జైపూర్: అత్యధికంగా ఆర్డర్ అయిన స్వీట్ సోన్ పాపడి. కొన్ని సంప్రదాయాలను వదులుకోలేం కదా. అహ్మదాబాద్‌లో సేవ్, భేల్కు కూడా మంచి ఆదరణ కనిపించింది
బెంగళూరు: వడ, కోడుబలే ఎక్కువగా ఇష్టపడ్డారు
హైదరాబాద్: చకోడీ తనదైన కరకరలాడే రుచిని తెచ్చింది
కొచ్చి, తిరువనంతపురం: పనస చిప్స్ ప్రత్యేకంగా నిలిచాయి
పుణె: చివ్డా, భాఖర్వాడీ పండగ ఇష్టాలుగా నిలిచాయి
పండగ తిండికి ఆరోగ్యకరమైన మలుపు
పండగ విందులో ప్రొటీన్ కూడా ఉండకూడదని ఎవరన్నారు? సంప్రదాయ ఇష్టాలతో పాటు ఆరోగ్యకరమైన ఎంపికలకు కూడా ప్రజలు చోటు ఇస్తున్నారు.
ప్రొటీన్ ప్లీజ్: ప్రొటీన్ చిప్స్ ఆర్డర్లు 239% పెరిగాయి.
చిరుధాన్యాలు, మఖానా: రాగి, జొన్న, సజ్జ స్నాక్స్ 188% పెరిగాయి. మఖానా 52% పెరిగింది.
తీపి ఉంది, చక్కెర లేదు: షుగర్ లేని స్వీట్లు 71%, షుగర్ లేని స్వీటెనర్లు 80%, షుగర్ లేని కుకీలు 51% పెరిగాయి.
పార్టీ ఇప్పుడే మొదలైంది: పండగ కొత్త బట్టల నుంచి చివరి నిమిషం అవసరాల వరకు
దీపావళి జాబితా స్వీట్లు, అలంకరణతో ఆగిపోదు. భారతీయులు దాదాపు అన్నీ కొనేశారు.
కొత్త ఏడాది, కొత్త బట్టలు? చెప్పులు, షూస్ ఆర్డర్లు 79%, బ్యాగులు, యాక్సెసరీలు 68%, దుస్తులు 50% పెరిగాయి.
గిఫ్ట్ ప్యాకింగ్ రెడీ: గిఫ్ట్ ర్యాప్ పేపర్ 78%, గిఫ్ట్ బ్యాగులు 50% పెరిగాయి. బహుమతి కంటే దాన్ని ఇచ్చే తీరు కూడా ముఖ్యమే కదా.
స్నాక్స్ జోరు: తినుబండారాలు, స్నాక్స్ 56%, కూల్ డ్రింక్స్, జ్యూస్‌లు 49% పెరిగాయి.
పూజా సామాన్లు కూడా సిద్ధం: బతాషా, అగరబత్తీల నుంచి విగ్రహాలు, పూజా సామగ్రి వరకు, పండగ జాబితాను ప్రజలు ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటున్నారు.
దీపావళి ఏర్పాట్లకు నిద్రే లేదు! రాత్రి 12 నుంచి 2 గంటల మధ్య ఆర్డర్లు గణనీయంగా పెరిగాయి. ఇంటిని పండగకు మెరిపించే వస్తువులు (అలంకరణ లైట్లు 903%, కొవ్వొత్తులు 289% పెరుగుదల) నుంచి అతిథులకు చివరి నిమిషంలో కావాల్సిన విస్కీ గ్లాసులు (136% పెరుగుదల) వరకు, అర్ధరాత్రి హడావిడిలో అన్నీ ఉన్నాయి. సోన్ పాపడి, కాజూ కత్లీ పండగ తీపి కోరికను తీర్చాయి. కోలా, చిప్స్, చాక్లెట్లు అర్ధరాత్రి స్నాక్స్ జాబితాలో ముందున్నాయి. తాజా పాలు, ఇన్స్టంట్ నూడుల్స్, టిష్యూలు కూడా రాత్రి కార్టుల్లో పెద్ద వాటా తీసుకున్నాయి.
షాపింగ్‌కు శుభ ముహూర్తం: పండగ షాపింగ్ నవంబర్ 1 నుంచే మొదలైంది. షాపింగ్ జాబితాకు షాపు టైమింగ్స్ తెలియవు అనడానికి ఇదే రుజువు.




కామెంట్లు (0)