Magazines

ఎనిమిది కొత్త శాఖలను ప్రారంభించిన కరూర్ వైశ్యా బ్యాంక్‌

1 గంట క్రితం

Karur Vysya Bank
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 02, 2026 | 3 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : కరూర్ వైశ్యా బ్యాంక్ (KVB), భారతదేశంలోని ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఒకటి. నాలుగు రాష్ట్రాల్లో ఎనిమిది కొత్త శాఖలను ప్రారంభించడం ద్వారా దేశవ్యాప్తంగా తన శాఖల నెట్‌వర్క్‌ను 929కి విస్తరించింది. కీలక మార్కెట్లలో తన ఉనికిని మరింత బలోపేతం చేసుకోవడంతో పాటు, మెట్రో నగరాలు, సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేయాలన్న బ్యాంక్ నిబద్ధతను ఈ విస్తరణ ప్రతిబింబిస్తుంది.

బ్యాంక్ ప్రారంభించిన ఎనిమిది కొత్త శాఖల్లో మూడు తమిళనాడులో, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో రెండేసి, ఉత్తరప్రదేశ్‌లో ఒకటి ఉన్నాయి. తమిళనాడులోని శాఖలు చెన్నైలోని చూలై, తిరుకళుకుండ్రం, తిరుచిరాపల్లిలోని వైయంపట్టిలలో ఉన్నాయి. కర్ణాటకలోని శాఖలు బెంగళూరులోని నాగరభావి, హులిమావులలో ఉన్నాయి. తెలంగాణలోని శాఖలు బాచుపల్లి, తాండూరులో ఉండగా, ఉత్తరప్రదేశ్‌లోని శాఖ ఆగ్రాలో ఉంది.

ఈ విస్తరణలో భాగంగా మెట్రో నగరాల్లో నాలుగు, సెమీ అర్బన్ ప్రాంతాల్లో మూడు, గ్రామీణ ప్రాంతంలో ఒక శాఖను ప్రారంభించారు. వివిధ భౌగోళిక ప్రాంతాల్లోని వినియోగదారులకు బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేయాలన్న KVB లక్ష్యాన్ని ఈ విస్తరణ ప్రతిబింబిస్తుంది.

తెలంగాణలో, బాచుపల్లి మరియు తాండూరులలో కొత్తగా ఏర్పాటు చేసిన శాఖలను స్థానిక ప్రముఖుల సమక్షంలో ప్రారంభించారు. బాచుపల్లి శాఖను శ్రీ డి. దాయక రెడ్డి, దయాకర్ వ్యవస్థాపకులు మరియు చైర్మన్, 'ప్రగతి గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్', అలాగే డాక్టర్ రంజితా నాదెండ్ల (MBBS, ఫెలోషిప్ ఇన్ డయాబెటాలజీ - NHS, UK), 'డాక్టర్ రంజితాస్ క్లినిక్', బాచుపల్లి కలిసి, సంప్రదాయబద్ధంగా గాయత్రీ దీపం వెలిగించి ప్రారంభించారు.

తాండూరు శాఖను శ్రీ కల్వ రాధాకృష్ణ, డైరెక్టర్, 'రాడికల్ బయో-ఆర్గానిక్స్ లిమిటెడ్' (తాండూరు) మరియు శ్రీమతి బిచాల బిచ్చల జ్యోతి కలిసి, గాయత్రీ దీపాన్ని వెలిగించి ప్రారంభించారు. అలాగే, శ్రీ కట్కం కటకం వీరేందర్, 'గ్రెయిన్ అండ్ సీడ్స్ మెర్చంట్స్ అసోసియేషన్' అధ్యక్షుడు, తాండూరు, ఈ శాఖలోని 'సేఫ్ రూమ్'ను ప్రారంభించారు.

ఈ రెండు శాఖలు వినియోగదారులకు బ్యాంకింగ్ సేవలను సులభంగా చేరువ చేసేలా అనువైన ప్రదేశాల్లో ఏర్పాటు చేశారు. బాచుపల్లి శాఖ, SVM హోటల్ సమీపంలోని బాచుపల్లి–నిజాంపేట రోడ్డులో, 'SSV క్యాపిటల్' భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లో (H. No. 1-3/11 & 1-3/11A) ఉంది. తాండూరు శాఖ, వికారాబాద్ జిల్లా, తాండూరులోని ఘనాపూర్ వార్డు, ముధెల్లి నారాయణ్ మార్గ్‌లో (డోర్ నెం. 5-1-146/1 to 6) ఉంది.

శ్రీ రమేష్ బాబు, మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ, కరూర్ వైశ్య బ్యాంక్, ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో కొత్త శాఖను ప్రారంభించారు, తద్వారా బ్యాంక్ శాఖల నెట్‌వర్క్ విస్తరణలో మరో ముందడుగు వేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ప్రధాన మార్కెట్లలో మా ఉనికిని మరింత బలోపేతం చేయడంతో పాటు, వినియోగదారులకు బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేయడంలో ఎనిమిది కొత్త శాఖల ప్రారంభం మరో కీలక అడుగు. మెట్రో నగరాలు, సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా రిటైల్, ఎంఎస్ఎంఈ, వ్యవసాయ బ్యాంకింగ్ రంగాల్లో మాకు గణనీయమైన అవకాశాలు కనిపిస్తున్నాయి. భౌతిక శాఖల విస్తరణపై మా నిరంతర పెట్టుబడులకు డిజిటల్ బ్యాంకింగ్ సామర్థ్యాలను జోడించడం ద్వారా వినియోగదారులకు మరింత సమర్థవంతంగా సేవలందించగలుగుతాము. అలాగే, వారితో మా సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటూ, స్థిరమైన వ్యాపార వృద్ధిని సాధించగలుగుతాము,” అని అన్నారు.

బ్యాంక్ వ్యాపారంలో నమోదవుతున్న నిరంతర వృద్ధికి అనుగుణంగా ఈ విస్తరణ చేపట్టబడింది. సెప్టెంబర్ 30, 2026 నాటికి KVB మొత్తం వ్యాపారం ₹2,39,712 కోట్లకు చేరుకుంది. ఇందులో ₹1,28,123 కోట్ల డిపాజిట్లు, ₹1,11,589 కోట్ల అడ్వాన్సులు ఉన్నాయి. FY27 రెండో త్రైమాసికంలో బ్యాంక్ ₹788 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఇది గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే 37.28% వృద్ధిని సూచిస్తుంది.

తన శాఖల నెట్‌వర్క్‌ను విస్తరించడంతో పాటు, డిజిటల్ బ్యాంకింగ్‌లో నిరంతరం పెట్టుబడులు పెట్టడం ద్వారా కరూర్ వైశ్యా బ్యాంక్ వినియోగదారులకు మరింత సౌకర్యవంతమైన సేవలను అందించడం, వివిధ ప్రాంతాల్లో తన ఉనికిని బలోపేతం చేసుకోవడం, దేశవ్యాప్తంగా వ్యక్తులు, వ్యాపారాల మారుతున్న బ్యాంకింగ్ అవసరాలను తీర్చడంపై దృష్టి సారిస్తోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్