- రోడ్డుపై ధాన్యం ఆరబోస్తే కేసులు నమోదు చేస్తాం
- సత్తుపల్లి ఎస్ హెచ్ ఓ తుమ్మలపల్లి శ్రీహరి
నవతెలంగాణ-సత్తుపల్లి : రోడ్డుమీద ఆరబోసిన ధాన్యం కుప్పను ఢీకొని వ్యక్తి ఒకరు మృతి చెందిన ఘటన సత్తుపల్లి మండలం సదాశివునిపాలెం రహదారిపై సోమవారం జరిగింది. మండలంలోని తుంబూరు గ్రామానికి చెందిన తురకా రాంబాబు మోటార్ సైకిల్‌పై వచ్చి సదాశివునిపాలెం రోడ్డుపై ఆరబోసిన వరి కుప్పను బలంగా ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదానికి కారణమైన గాయం రాము, చాట్ల లక్ష్మి అనే ఇద్దరిపై సత్తుపల్లి పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. రహదారులపై ధాన్యం ఆరబోసి ప్రమాదాలకు కారణమయ్యే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని సత్తుపల్లి స్టేషన్ హౌస్ ఆఫీసర్ తుమ్మలపల్లి శ్రీహరి హెచ్చరించారు. రహదారులపై ధాన్యాన్ని ఎండబెట్టడం, వాహనాలు రాకుండా రాళ్లు, ముళ్ల కంచెలు పెట్టడం వల్ల ప్రమాదాలు జరిగి అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని సీఐ శ్రీహరి తెలిపారు. ఈ విధమైన ప్రమాదాలు జరిగిన నేపథ్యంలో పూర్తి బాధ్యత ధాన్యం యజమానులదేనని, చట్టరీత్యా కఠిన చర్యలు ఉంటాయని సీఐ శ్రీహరి స్పష్టం చేశారు. రైతులు తమ పంటను రోడ్లపై కాకుండా ప్రభుత్వం కేటాయించిన కొనుగోలు కేంద్రాలు లేదా ప్రత్యామ్నాయ కల్లాల్లో మాత్రమే ఆరబోసుకోవాలని సీఐ తుమ్మలపల్లి శ్రీహరి సూచించారు.






కామెంట్లు (0)