నవతెలంగాణ-హైదరాబాద్: కేసీఆర్ ఏపీకి మంచి మనిషి అని, కానీ తెలంగాణకు ముంచే మనిషి అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. నీటి హక్కులను వారే కాపాడినట్లుగా దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. పల్నాడు వాటర్ గ్రిడ్ విషయంలో బీఆర్ఎస్ నేతలు తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు. సోమవారం హైదరాబాద్ వేదికగా మీడియాతో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. నీటి విషయంలో ప్రతిపక్షాల నేతలు అవాస్తవాలు చెబుతున్నారని మండిపడ్డారు. అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. పల్నాడు వాటర్ గ్రిడ్‌పై ఆధారాలతో సహా తాము నిరూపిస్తామని స్పష్టం చేశారు. కృష్ణా నీటిని ఎలా తాకట్టుపెట్టారో నిరూపిస్తామని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు తమ గురించి దుష్ప్రచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు.మాజీ సీఎం కేసీఆర్ హయాంలోనే తెలంగాణ నీటి హక్కులను కాలరాశారని ముఖ్యమంత్రి (Telangana CM Revanth Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు
21 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 23, 2026 | 1 నిమిషాల చదవడం




కామెంట్‌లు (0)